టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రభాస్ ఆఖరుగా నాక్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ , మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ మూవీలోనూ , హాను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ మూవీ లోనూ హీరో గా నటిస్తున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పీరిట్ అనే సినిమాలో హీరోగా నటించడానికి రెడీ అయ్యాడు. స్పిరిట్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే , ప్రభాస్ కి జోడిగా నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

మూవీ బృందం వారు కూడా దీపికా పదుకొనే ను స్పిరిట్ మూవీ లో హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించగా ఆమె కూడా ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందనున్న స్పిరిట్ మూవీ లో హీరోయిన్గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అంత ఓకే అయ్యాక కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుండి దీపిక ను తీసేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి ఈ మూవీ లో దీపికా స్థానంలో మరో హీరోయిన్ వెతికే పనిలో బిజీ అయినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కి జోడిగా స్పిరిట్ మూవీలో ఏ బ్యూటీ హీరోయిన్గా నటిస్తోంది అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ప్రభాస్ లాంటి భారీ క్రేజ్ ఉన్న హీరో నటించనున్న మూవీ కావడం , వరుస విజయాలతో అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న దర్శకులలో ఒకరు అయినటువంటి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కావడంతో స్పిరిట్ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: