కొంత మంది నటీమణులు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో వరుస అపజయాలను అందుకున్న ఆ తర్వాత వారు మంచి విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ స్థాయి వరకు చేరుకున్న వారు కూడా ఉన్నారు. అలా కెరియర్ ప్రారంభంలో వరస పెట్టి అపజయాలను అందుకొని ఆ తర్వాత మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈమె మోడలింగ్ రంగం నుండి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె సుశాంత్ హీరోగా రూపొందిన ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ ఈ మూవీ ద్వారా మీనాక్షి కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడీ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ ఈ సినిమాలో మీనాక్షి తన అందాలను భారీగా ఆరబోసింది. దానితో ఈ బ్యూటీ కి యూత్ ఆడియన్స్ లో మంచి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం ఈమె తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఈమె కొంత కాలం క్రితం సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం కూడా ఈమె చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. ఇలా కెరియర్ ప్రారంభంలో ఈమె వరస ప్లాప్స్ ఎదుర్కొన్న ఆ తర్వాత మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mc