
తెలుగు, తమిళ భాషలలో వరుస సినిమాలలో బిజీగా ఉన్న ఈ ముద్దు గుమ్మ తమిళంలో కూడా పలు చిత్రాలలో నటిస్తోంది. గత రెండు నెలల్లోనే సుమారుగా నాలుగు పైగా సినిమాలలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలాంటి సమయంలోనే కయాదు లోహర్ మీద పలు స్కామ్ లో ఆరోపణలు చిక్కుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం టాస్మాక్ స్కాం లో కయాదు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిందని దీంతో ఈడి అధికారులు కూడా దాడులు చేస్తున్న సమయంలో ఈ విషయం బయటపడింది అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే వీరు నిర్వహించేటువంటి నైట్ పార్టీలకు హాజరుకావడమే కాకుండా దాదాపుగా 35 లక్షల రూపాయల వరకు ఈమెకు చెల్లించారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం అటు కోలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర కలకలాన్నే సృష్టిస్తోంది. ఈ విషయం విన్న అటు అభిమానులను కూడా ఆశ్చర్య పోయేలా కామెంట్స్ చేస్తున్నారు. మరి తమిళ పరిశ్రమ కూడా నెమ్మదిగా అవినీతికి పాల్పడడం ప్రారంభించిందా అంటూ మరికొంతమంది నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కయాదు లోహర్ అభిమానుల కోరిక మేరకు ఈ విషయం పైన ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.