నందమూరి బాలకృష్ణ వల్ల ఓ దర్శకుడు చిరంజీవితో సినిమా వద్దనుకున్నాడట. అసలు ఏం జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం అశ్వినీ దత్ , చిరంజీవి హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా గోపాల్ ను అశ్విని దత్ కలిసి చిరంజీవి గారు మా బ్యానర్లో సినిమా చేయడానికి కమిట్ అయ్యారు. నువ్వు ఆ సినిమాకు దర్శకత్వం వహించు. చిన్ని కృష్ణ దగ్గర ఒక కథ ఉంది. దాన్ని వినండి. అది నచ్చితే చిరంజీవి హీరోగా మీరు దర్శకుడిగా నేను నిర్మాతగా సినిమా చేద్దాం అని అశ్విని దత్ , గోపాల్ కి చెప్పాడట. దానితో గోపాల్ , చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథను విన్నాడట. కానీ ఆ కథ ఆయనకు పెద్దగా నచ్చకపోవడంతో ఆ కథతో సినిమా చేయను అని చెప్పాడట. దానితో ఒక రోజు ప్రముఖ కథ రచయిత పరుచూరి గోపాలకృష్ణ , గోపాల్ ను కలిసి నువ్వు ఎందుకు చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథతో చిరంజీవితో సినిమా చేయను అంటున్నావు అని అడిగాడట.

దానితో గోపాల్ ... నేను ఇప్పటికే బాలకృష్ణ గారితో సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు అనే రెండు ఫ్యాక్షన్ సినిమాలు చేశాను. చిన్ని కృష్ణ నాకు చెప్పిన కథ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది. ఇప్పటికే నేను చిరంజీవి గారితో మెకానిక్ అల్లుడు అనే సినిమా చేశాను. ఆ మూవీ ఆడలేదు. మరోసారి చిరంజీవి నా వల్ల ఫ్లాప్ రాకూడదు. అందుకే నేను ఆ కథతో చిరంజీవితో సినిమా చేయను అని చెప్పాను అని అన్నాడట. దానితో పరుచూరి గోపాలకృష్ణ ... నువ్వు బాలకృష్ణతో ఫ్యాక్షన్ సినిమాలు చేసావు. చిరంజీవితో కాదు. చిన్ని కృష్ణ దగ్గర ఉన్న కథతో నువ్వు చిరంజీవిని హీరోగా ఫ్యాక్షన్ మూవీ రూపొందించు అది మంచి విజయం సాధిస్తుంది అని చెప్పాడట. దానితో కన్విన్స్ అయినా గోపాల్ , చిరంజీవి హీరోగా అశ్వినీ దత్ నిర్మాతగా చిన్ని కృష్ణ ఇచ్చిన కథతో ఇంద్ర అనే టైటిల్ తో మూవీ ని రూపొందించాడట. ఆ మూవీ ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: