జూనియర్ ఎన్టీఆర్ , సమంత కాంబినేషన్లో ఇప్పటికే నాలుగు సినిమాలు వచ్చాయి. ఆ నాలుగు సినిమాల్లో కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధిస్తే , కొన్ని సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. వీరిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమాలో కూడా ఓ చిన్న కామన్ పాయింట్ ఉంది అదేమిటో గమనించారా ..? మరి తారక్ , సమంత కాంబోలో వచ్చిన సినిమాలేవి ..? వాటిలో ఉన్న కామన్ పాయింట్ ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం.

తారక్ , సమంత కాంబోలో మొదటగా బృందావనం అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో సమంతతో పాటు కాజల్ అగర్వాల్ కూడా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో రామయ్య వస్తావయ్య అనే సినిమా వచ్చింది. ఈ మూవీ లో సమంత తో పాటు శృతి హాసన్ కూడా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత తారక్ , సమంత కాంబోలో రభస అనే మూవీ వచ్చింది. ఈ మూవీ లో సమంత తో పాటు ప్రణీత కూడా హీరోనే నటించింది. ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

ఆఖరుగా తారక్ , సమంత కాంబోలో జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చింది. ఈ మూవీ లో సమంత తో పాటు నిత్యా మీనన్ కూడా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. తారక్ , సమంత కాంబోలో వచ్చిన నాలుగు సినిమాల్లో ఉన్న కామెంట్ పాయింట్ ... వీరిద్దరి కాంబోలో వచ్చిన ప్రతి సినిమాలో కూడా సమంతతో పాటు మరో హీరోయిన్ కూడా ఉండడమే. ఇలా తారక్ , సమంత కాంబోలో వచ్చిన ప్రతి సినిమాలో సమంత తో పాటు మరో హీరోయిన్ కూడా తారక్ కి జోడిగా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: