పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చాలా కాలం క్రితం హరిహర వీరమల్లు అనే సినిమా స్టార్ట్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పలు మార్లు స్టార్ట్ అయి ఆగిపోవడంతో ఈ మూవీ దర్శకత్వ బాధ్యతల నుండి క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నాడు. దానితో కిరణ్ అబ్బవరం హీరో గా రూపొందిన రూల్స్ రంజన్ మూవీ కి దర్శకత్వం వహించిన జ్యోతి కృష్ణ ఈ సినిమా యొక్క దర్శకత్వ బాధ్యతలను స్వీకరించాడు. ఈ మూవీ ని ఏ ఏం రత్నం అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

మూవీ ని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ల స్పీడును పెంచింది.

అందులో భాగంగా నిన్న ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మూడవ సాంగ్ అయినటువంటి అసుర హననం అంటూ సాగే సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ లోని మూడవ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 19.93 మిలియన్ వ్యూస్ ... 313.4 లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ లోని మూడవ సాంగ్ కి ప్రేక్షకుల నుండి విడుదల 24 గంటల్లో అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pk