మెగాస్టార్ చిరంజీవి తనతో పాటు వర్క్ చేసే ప్రతి ఒక్కరికి చాలా గౌరవం ఇస్తూ ఉంటారు.ముఖ్యంగా హీరోయిన్లను,దర్శక నిర్మాతలను గౌరవిస్తూ ఉంటారు.అలాగే ఆయనతో కలిసి వర్క్ చేసే డైరెక్టర్లకు ఎప్పటికప్పుడు మెగా సర్ప్రైజ్లు మెగా గిఫ్టులు ఇస్తూ ఉంటారు. అలా తాజాగా తనతో సినిమా తీసి తనకు హిట్ అందించిన డైరెక్టర్ బాబీకి లగ్జరీ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బాబీ కి ఇచ్చిన వాచ్ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా కంటే ముందే బాబి మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని.. మెగా ఫ్యామిలీ అంటే పడి చచ్చిపోతారు.

అలా తన అభిమాని అయినటువంటి డైరెక్టర్ తో వాల్తేరు వీరయ్య సినిమాకు ఒప్పుకున్న చిరంజీవి ఈ సినిమాతో భారీ హిట్ కొట్టారు.. అలా తనకు హిట్ ఇచ్చాడు అనే కారణంతోను లేక ప్రేమతోనో తెలియదు కానీ తాజాగా లగ్జరీ వాచ్ ని డైరెక్టర్ బాబీకి గిఫ్ట్ గా ఇచ్చారు చిరంజీవి. ఇక ఈ వాచ్ ని స్వయంగా చిరంజీవి బాబి చేతికి పెట్టారు. అయితే ఈ విషయాన్ని డైరెక్టర్ బాబీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.మెగా ఫ్యామిలీ నుండి నాకు మెగా సర్ప్రైజ్ వచ్చింది.. చిరంజీవి అన్నయ్య ఇచ్చిన ఈ గిఫ్ట్ ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆయన ఇచ్చిన బహుమతిని ఎప్పటికీ విలువ కట్టలేను.

 థాంక్యూ అన్నయ్యా అంటూ తన చేతికి వాచ్ పెడుతున్న ఫోటోలను షేర్ చేసుకున్నారు డైరెక్టర్ బాబీ. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది.ఇక డైరెక్టర్ బాబి త్వరలోనే చిరంజీవితో మరో సినిమా కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి తో సినిమా చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో కూడా ఓ సినిమా ఉంటుందని వార్తలు వినిపించినప్పటికీ ఆ సినిమా ప్రస్తుతం మేనల్లుడితో చేయమని చెప్పినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ మళ్ళీ బాబీతో సినిమా చేస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: