
కేసీఆర్ ఉర్దూలో మాట్లాడకపోవడం, ఎస్సీ వర్గీకరణ గురించి, వక్ఫ్ బిల్లు గురించి స్పందించకపోవడం, బీసీలకు రిజర్వేషన్ల గురించి ప్రస్తావించకపోవడం మైనస్ అయిందని కవిత చెప్పుకొచ్చారు. బీజేపీ గురించి కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడటం వల్ల ఆ పార్టీతో పొత్తు ఉందేమో అనే ఊహాగానాలు వినిపించాయని కవిత కామెంట్లు చేశారు.
ప్లీనరీ నిర్వహించి క్యాడర్ అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని కవిత కోరడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణ గురించి స్పష్టత ఇవ్వాలని కామెంట్లు చేశారు. కవిత ఆవేదనలో న్యాయం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని కవిత ప్రధానంగా సూచనలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
భవిష్యత్తులో బీ.ఆర్.ఎస్ అధికారంలోకి రావాలంటే కేసీఆర్ సైతం కొన్ని విషయాల్లో మారక తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే రాష్ట్రంలో గెలుపు కోసం బీ.ఆర్.ఎస్ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. కవిత కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో అయితే లేరని ఆమె కామెంట్ల ద్వారా అర్థమవుతోంది. కవిత కామెంట్ల విషయంలో బీ.ఆర్.ఎస్ ఎలా ముందుకెళ్తుందో చూడాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు