బాలయ్య.. ఎవరికీ భయపడరు ..బాలయ్య తాను అనుకున్న పనికి ఖచ్చితంగా చేసేస్తారు .. బాలయ్య ఎంతో నీతి నిజాయితీగా తాను కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేస్తూ ఉంటాడు.  నందమూరి అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు . బాలయ్య గురించి ఇప్పటివరకు ఇలాంటి వార్తలు మాత్రమే విన్నాం. అయితే ఇప్పూదు బాలయ్య గురించి ఓ వార్త సోషల్ మీడియాలో నెగిటివ్ గా ట్రెండ్ అవుతుంది. బాలయ్య తన సినిమాలో ఓ హీరోయిన్ వద్దు అంటూ డైరెక్టర్ కి సజెస్ట్ చేశాడు అన్న వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది .


సాధారణంగా తన సినిమాలో హీరోయిన్ ని ఎవరిని పెట్టుకోవాలి అనే విషయం పూర్తిగా మేకర్స్ కి వదిలేస్తూ ఉంటారు బాలయ్య.  ఈ విషయాన్ని చాలామంది సినీ మేకర్స్ ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైం "నా సినిమాలో ఆ హీరోయిన్ వద్దులే " అంటూ ఒక డైరెక్టర్ కి రిక్వెస్ట్ చేశారట.  ఆమె మరెవరో కాదు "హనీ రోజ్".  ప్రెసెంట్ అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు బాలయ్య . అయితే ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే బాలయ్య "క్రిష్" దర్శకత్వంలో ఆదిత్య 999 అనే సినిమా చేయబోతున్నాడు అంటూ ఓ టాక్ బయటకు వచ్చింది .



సినిమా ద్వారానే మోక్షజ్ఞ తన సినీ కెరియర్ని స్టార్ట్ చేయబోతున్నాడు అంటూ కూడా ఓ న్యూస్ తెరపైకి వచ్చింది . అయితే క్రిష్ తన సినిమాలో హీరోయిన్స్ విషయంలో చాలా డిఫరెంట్ స్ట్రాటజీలని  ఫాలో అవుతూ ఉంటాడు . క్రేజీగా బిజీ బిజీగా ఉన్న హీరోయిన్స్ తన సినిమాలో చూస్ చేసుకోడు . టాలెంట్ ఉండి అవకాశాలు లేని బ్యూటీస్ ని తాను చూస్ చేసుకుంటాడు.  ఈ క్రమంలోనే హనీ రోజ్ ని బాలయ్య సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకున్నారట.  వీర సింహారెడ్డి సినిమాలో హనీ రోజ్ - బాలయ్య పెర్ఫార్మన్స్ ఏ రేంజ్ లో కుమ్మేసిందో అందరికీ తెలిసిందే . వీళ్ళిద్దరూ బాల్కనీలో తీసుకున్న ఒక ఫోటో పెద్ద రాద్ధాంతమే క్రియేట్ చేసింది.



బాలయ్య క్యారెక్టర్ పై తప్పుడు కామెంట్స్ చేసేలా చేసింది.  అప్పట్లో ఆ ఫోటో సెన్సేషన్ గా మారింది . ఆ ఫోటో వల్ల కొన్ని ఫ్యామిలీ గొడవలు కూడా అయ్యాయి అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . అయితే మరొకసారి క్రిష్ ఆ బ్యూటీ తోనే స్క్రీన్ షేర్ చేసుకునే విధంగా కథను రాసుకుంటూ ఉండటంతో బాలయ్య "ఆ హీరోయిన్ వద్దులే" అంటూ ఓపెన్ గానే చెప్పేసాడట.  దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీంతో జనాలు రకరకాలుగా దీని పై స్పందిస్తున్నారు. " ఎంతటి వాడైనా సరే భార్య దగ్గర భయపడాల్సిందే.. బాలయ్య బాబు భార్య వసుంధర దెబ్బకి భయపడినట్లు ఉన్నాడు" అంటూ కొంతమంది సరదాగా కామెంట్స్ చేస్తుంటే ..మరి కొంతమంది నాటిగా కామెంట్స్ చేస్తున్నారు . కానీ బాలయ్య మాత్రం ఎప్పుడూ తన సినిమాల విషయంలో పక్క ప్లాన్ తోనే ముందుకు వెళుతూ ఉంటాడు "హనీ రోజ్" ని ఈ సినిమాలో వద్దు అన్నాడు అంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండనే ఉంటుంది అంటున్నారు నందమూరి అభిమానులు . చూద్దాం మరి ఈ సినిమా విషయంలో క్రిష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో..?

మరింత సమాచారం తెలుసుకోండి: