అవును "పెళ్లి ఒకరితో శోభనం మరొకరితో"  ప్రెసెంట్ అందరు ఇలానే మాట్లాడుకుంటున్నారు . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో జరిగేటివి అన్ని సోషల్ మీడియా ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒక బిగ్ సినిమా అనౌన్స్ చేసినప్పుడు పర్ఫెక్ట్ గా కేర్ఫుల్గా ఆ సినిమాలో నటీనటులు ఎవరు అనేది ముందు నుంచి ఆలోచించుకొని కమిట్మెంట్ తీసుకొని కాల్ షీట్స్ బుక్ చేసుకుని అనౌన్స్ చేయాలి. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం కొందరు డైరెక్టర్లు సినిమా పబ్లిసిటీ కోసమో పాపులారిటీ కోసమో రకరకాల స్ట్రాటజీలను  ప్రయోగిస్తున్నారు . సినిమా అనౌన్స్మెంట్ చేసేస్తారు .. మా సినిమాలో హీరో వీళ్ళు అని చెప్పుకొస్తారు . ఆ తర్వాత ఆ సినిమాలో హీరోయిన్ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వరు . ఇంకేముంది సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వార్తలు వినిపిస్తూనే ఉంటాయి . ఆ సినిమాలో హీరోయిన్ వాళ్లు .. ఈ సినిమాలో హీరోయిన్ వీళ్ళు అంటూ రకరకాలుగా వార్తలు ట్రెండ్ అవుతూనే ఉంటాయి .


అలా ట్రెండ్ అయిన వార్తనే " స్పిరిట్ " సినిమాలో హీరోయిన్గా దీపిక పదుకొనే నటిస్తుంది . అయితే రీసెంట్ గానే ఈ సినిమా నుంచి సందీప్ రెడ్డి వంగ  ఆమె ని తప్పించిన్నట్లు తెలుస్తుంది. అసలు ఆమె ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది అన్న వార్త వైరల్ అయిన మూడు రోజులకే ఆమెని సినిమాలో నుంచి తప్పించారు అన్న వార్త తెరపైకి రావడం వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దీపికా పదుకొనే రీసెంట్ గానే తల్లి అయ్యింది.  తన బాడీ ఫిజిక్ మొత్తం కూడా మారిపోయింది . మరీ ముఖ్యంగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో సినిమాలో ఇలాంటి బ్యూటీ నా ..? అంటూ నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి.

 

కానీ సందీప్ రెడ్డివంగ డైరెక్షన్ కావడంతో అందరూ ఏదో ఎక్స్పెక్ట్ చేశారు . అయితే అత్యాశకు పోయిన దీపిక ఒకటి కాదు రెండు కాదు దాదాపు 20 కోట్లు డిమాండ్ చేసిందట . మరి అంతలా సందీప్ రెడ్డివంగా ఆ క్యారెక్టర్ లో ఎన్ని కండిషన్స్ పెట్టాడో..? అయితే సందీప్ రెడ్డివంగా  20 కోట్లు ఇచ్చుకోలేము అంటూ ఈ సినిమాలో నుంచి ఆమెను తీసేసారట . ఇప్పుడు ఆ ప్లేస్ లోకి సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ వచ్చి చేరినట్లు తెలుస్తుంది.  దీంతో సినిమా ఇండస్ట్రీలో జరిగే ప్రమోషన్ స్ట్రాటజీ ల గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు .



"పెళ్లి ఒకరితో శోభనం మరొకరితో" అంటూ ఘాటు కామెంట్స్ చేస్తూ సినీ డైరెక్టర్లకు ఇలాంటి తిప్పలు తప్పవు అంటూ రియాక్ట్ అవుతున్నారు.  నిజమే కేవలం స్పిరిట్ సినిమాలో మాత్రమే కాదు అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో కూడా ముందు నుంచి హీరోయిన్ సమంత అంటూ మాట్లాడుకున్నారు . లాస్ట్ కి హీరోయిన్ సమంత కాకుండా పోయింది . అంతేనా బన్నీ - సాయి పల్లవి కాంబోలో ఎప్పటినుంచో సినిమా వస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది అది కూడా సెట్ అవ్వట్లేదు . సినీ డైరెక్టర్ ఒక హీరోయిన్ ని తమ కథలో అనుకుంటే మరొక హీరోయిన్ సెలెక్ట్ అవుతుంది. అంటే పెళ్లి ఒకరితో చేసుకుని శోభనం మరొకరితో చేసుకున్నట్లా..? అంటూ కుర్రాళ్ళు ఘాటు సెటైర్స్ వేస్తున్నారు. ప్రసెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే నిజంగానే సినీ డైరెక్టర్లకి ఈ హీరోయిన్స్ విషయంలో కొత్త కష్టాలు తప్పేలా లేవు..!

మరింత సమాచారం తెలుసుకోండి: