
అయితే సోషల్ మీడియాలో ఎంత నెగిటివిటీ జరుగుతున్న తారక్ మాత్రం పాజిటివ్గా స్పందించారు . ఈ టీజర్ కు వస్తున్న స్పందన పై తాజాగా ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. " ఈ ప్రశంసలు అభిమానులు కురిపిస్తున్న ప్రేమ చూస్తుంటే హీరో అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా గర్వంగా ఉంది.. ఈ ప్రేమను దేవుడు ఇచ్చిన వరంలా భావిస్తున్నాను . ముఖ్యంగా వార్ 2 పై మీరు చూపిస్తున్న ప్రేమకు థాంక్స్ . దేశంలోని ప్రతి మూల నుంచి వస్తున్న స్పందనకి నేను ఉప్పొంగిపోయాను . ఒక టీజర్ కి ఇలాంటి అభిమానం చూపిస్తే ఇక ముందు ముందు ఎలాంటి రిజల్ట్ ఉంటుందో అర్థం అయిపోతుంది " అనే రేంజ్ లోనే చెప్పుకొచ్చారు.
అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు దీనిపై ఫుల్ నెగిటివిటీ క్రియేట్ అయిపోయింది . వార్ 2 సినిమా గురించి ప్రతి ఒక్కరు నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటే తారక్ ఎందుకు ఇంత పాజిటివ్ గా స్పందిస్తున్నారు. కనీసం తారక్ స్పందించకపోయిన పెద్దగా ప్రాబ్లం వచ్చుండేది కాదు . ఫుల్ నెగెటివిటీ క్రియేట్ చేసిన టీజర్ పై ఇంత పాజిటివ్ గా మాట్లాడడం తన సినిమాకి తానే డప్పు కొట్టుకున్న విధంగా ఉంది అని .. ఇది ఎన్టీఆర్ తన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి మాట్లాడినట్లు ఉంది అని... నందమూరి ఫ్యామిలీ పరువు తీసేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది..!!!