
అయితే రీసెంట్ గానే ఆర్య త్రీ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించాడు దిల్ రాజు . దిల్ రాజు బ్యానర్ లోనే ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ అయింది. ఈ టైటిల్ ఎవరికోసం రిజిస్ట్రేషన్ చేయించాడు..? అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్ . బన్నీ అయితే కచ్చితంగా ఈ సినిమాలో నటించడు. పుష్ప లాంటి సినిమా తర్వాత బన్నీని ఆ టైప్ ఆఫ్ కంటెంట్ సినిమాలో చూస్తారు తప్పిస్తే ఒక అమ్మాయి వెనక ప్రేమ ప్రేమ అంటూ పడే క్యారెక్టర్ లో చూడలేరు . అల్లు అర్జున్ కూడా అందుకు ఒప్పుకోడు . అయితే ఎవరికోసం దిల్ రాజు ఈ ఆర్య 3 టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించాడు .
ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పుడు పెద్ద ఇంట్రెస్టింగ్ గా మారింది. కాగా ఈ టైటిల్ ని టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ కోసం రిజిస్ట్రేషన్ చేయించాడు అన్న వార్త బయటకు వచ్చింది . రౌడీ బాయ్స్ .. లవ్ మీ సినిమాలతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న దిల్ రాజు వారసుడు ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నాడట . ఈ సినిమాకి కధ సుకుమార్ ఇవ్వబోతున్నాడట . హీరోగా ఆశిష్ చేస్తున్నాడట. కానీ డైరెక్టర్ గా మాత్రం వేరే వాళ్ళు వర్క్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట . అయితే ఆర్య అనగానే అందరికీ అల్లు అర్జున్ కటౌట్ గుర్తొస్తుంది .
మరి అల్లు అర్జున్ లాంటి కటౌట్ ఆశిష్ దగ్గర ఉందా ..? అంటే లేదనే చెప్పాలి . ఆశిష్ ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న స్టార్ . మరి ఆయన చేతిలో ఇంత పెద్ద బరువు బాధ్యతలు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ..?? అనేది బన్నీ అభిమానుల అభిప్రాయం . అంతేకాదు కొంతమంది ఘాటుగా బన్నీ కాలి గోటికి కూడా ఆశిష్ సరిపోడు.. అలాంటిది ఆర్య సినిమా సీక్వెల్లో ఆశిష్ నా..? అంటూ ఓ రేంజ్ లో ఆయనని ట్రోల్ చేస్తున్నారు. తప్పులేదు కొత్త హీరో ని యంకరేజ్ చేయాలి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి ఆర్య 3 ఆశిష్ కి ఎంత సక్సెస్ ఇస్తుందో...???