ఏ ఇండస్ట్రీలో నైనా స్టార్ హీరోల వారసులకు ఎంట్రీ పెద్ద కష్టమేమి ఉండదు. వాళ్లు ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడే కాస్త ఆలస్యమైన కూడా వెంటనే ఇస్తూ ఉంటారు. స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తున్నారంటే తెర వెనుక అన్ని పనులకు కూడా సంసిద్ధం చేసుకొని ఇస్తూ ఉంటారు. కానీ స్టార్ ఫ్యామిలీ  వారసుల పని అలా ఉంటే వారసురాళ్ల విషయంలో మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. స్టార్ హీరో కుమారుడు హీరోగా వస్తానంటే అభిమానులు సపోర్టుగా నిలుస్తూ ఉంటారు.. కానీ అదే ఫ్యామిలీ నుంచి అమ్మాయి హీరోయిన్గా వస్తే మాత్రం అందుకు ఒప్పుకోరు.


హీరోయిన్ అంటే కచ్చితంగా గ్లామర్ షో చేయవలసి ఉంటుంది.అలాగే మిగతా వాళ్ళు ఆమె గురించి వేరే రకంగా కూడా మాట్లాడుకునే సందర్భాలు కూడా ఉంటాయి. అన్ని విషయాలలో కూడా ఇబ్బందికరమైన విషయాలు ఉంటాయి. కాబట్టి స్టార్ ఫ్యామిలీ నుంచి అమ్మాయిలు హీరోయిన్గా ఎంట్రీ చేద్దామనుకుంటే ముందు అభిమానులే ఒప్పుకోరు. అయితే కొంతమంది ఇలాంటివి దాటుకొని మరి హీరోయిన్ గా ప్రయత్నాలు చేసిన వారు పెద్దగా వర్కౌట్ కాలేకపోయారు. అలా ఘట్టమనేని కుటుంబం నుంచి సూపర్ స్టార్ కృష్ణ మంజుల కూడా నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.



ఇక తర్వాత మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కూడా ఎంట్రీ ఇవ్వగా సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు మళ్లీ ఘట్టమ నేని కుటుంబం నుంచి సితార వెండితెరపై ఎంట్రీ కి సిద్ధంగా ఉందా లేదా అనే విషయం ఇప్పుడు అందరిని సందిగ్ధంలో పడేస్తోంది. సితార ఇప్పటికే పలు రకాల యాడ్స్లలో నటించి భారీగానే క్రేజ్ సంపాదించుకుంది. ఒకవేళ ఇదే క్రేజ్ తో సితార వెండితెర పైన ఎంట్రీ ఇస్తే అభిమానులు సపోర్టు చేస్తారా? లేదా? అనేది కూడా చెప్పడం కష్టంగా ఉన్నది. గతంలో మంజుల ఎంట్రీ ఇస్తున్న సమయంలో చాలామంది వ్యతిరేకించారట. మరి ఇప్పుడు సీతారా ను ఎంకరేజ్ చేస్తారా లేదా అసలు సితార ఎంట్రీ ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: