సినిమాని ఎవ్వరైనా డైరెక్ట్ చేస్తారు. ప్రొడ్యూసర్స్ ని మాయమాటలతో మభ్యపెట్టి సినిమా కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేయించేస్తూ ఉంటారు . కానీ ఆ సినిమాలు  హిట్ అవుతాయా ..? అంటే కచ్చితంగా నో అని చెప్పాలి.  కోట్లు పెడితే కాదు సినిమాలో కంటెంట్ ఉంటే హిట్ అవుతుంది అంటూ ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి . మరీ ముఖ్యంగా తోపైన హీరోలు బడాబడా స్టార్ డైరెక్టర్ లు  తెరకెక్కించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. జనాలకి తెలియని వాళ్ళని కూడా సినిమాలో పెట్టి నటింపజేసిన ఆ సినిమాలు హిట్ అయ్యాయి.  దీన్ని బట్టి జనాలు ఏం కోరుకుంటున్నారు అనేది ఈజీ గా చెప్పేయచ్చు.


కేవలం ఎంటర్టైన్మెంట్.. ఎంటర్టైన్మెంట్ ఉంటే ఇంకేం వద్దు అని ఓపెన్ గానే చెప్పేస్తున్నారు సినీ లవర్స్ . అయితే కుర్రాళ్ళకి ఏం కావాలి అనే విషయం అనిల్ రావిపూడికి బాగా తెలుసు.  అందుకే తన సినిమాలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీని పండిస్తూ ఉంటారు . నేటి కాలం సమాజంలో చాలామంది డైరెక్టర్ లు బీప్ సౌండ్ వేసి కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కిస్తే అనిల్ రావిపూడి మాత్రం కేవలం క్లీన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.  ప్రజెంట్ అనిల్ రావిపూడి - చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నాడు.



వీళ్ళ కాంబోలో సినిమా రాబోతుంది అని తెలియగానే "సంక్రాంతికి వస్తున్నాం" కన్నా మంచి హిట్ వీళ్ళ ఖాతాలో పడిపోతుంది అంటూ ఫిక్స్ అయిపోయారు మెగా ఫాన్స్ . ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార సెలెక్ట్ అయ్యింది.  ఇక మాటల్లేవ్  మాట్లాడుకోవడాల్లే ఓన్లీ రికార్డ్స్ బ్లాస్టింగ్ అనే కామెంట్స్ కూడా చేశారు మెగా అభిమానులు . కాగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది . ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కోట్లాదిమంది ఫేవరెట్ బ్యూటీ మోమైత్ ఖాన్ నటించబోతుంది అన్న వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రమణ గోగులను మళ్లీ సినిమా ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం చేశాడు. ఇప్పుడు చిరంజీవి సినిమా కోసం మొమైత్ ఖాన్ ని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: