తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ గుర్తింపు కలిగిన స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఇకపోతే తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన స్టార్ హీరోలలో తలపతి విజయ్ ఒకరు. వీరిద్దరూ కూడా చాలా సంవత్సరాల క్రితం కెరియర్ను మొదలు పెట్టారు. వీరిద్దరి మధ్య అనేక సిమిలారిటీస్ ఉన్నాయి. వీరిద్దరి మధ్య ఉన్న సిమిలారిటీస్ విషయానికి వస్తే ... కెరియర్ను ప్రారంభించిన కొత్తలో పవన్ కళ్యాణ్ అనేక రీమిక్ సినిమాలలో నటించి అద్భుతమైన విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇక కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ కూడా కెరియర్ ను ప్రారంభించిన కొత్తలో అనేక రీమిక్ సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయం లోనే పవన్ కళ్యాణ్ జనసేన అనే ఓ రాజకీయ పార్టీని స్థాపించాడు.

ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం జరిగిన ఎన్నికలలో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే కెరియర్ పీక్స్ లో ఉన్న సమయం లోనే విజయ్ కూడా ఓ రాజకీయ పార్టీని స్థాపించాడు. ఇలా ఈ ఇద్దరి మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. కానీ ఒక విషయంలో మాత్రం విజయ్ ల పవన్ ఆలోచించడం లేదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అదేమిటి అంటే ..? ఈ మధ్య కాలంలో రీమిక్ సినిమాలను ప్రేక్షకులు పెద్దగా ఆదరించడం లేదు. దానితో విజే ఈ మధ్య కాలంలో రీమిక్ సినిమాలు పెద్దగా చేయడం లేదు. కానీ పవన్ మాత్రం రీమిక్ సినిమాలు చేయడం పై ఇప్పటికే ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో పవన్ అనేక రీమిక్ సినిమాలలో నటించాడు. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి. ఏదేమైనా కూడా టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి కోలీవుడ్లో విజయ్ కి అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: