లోక నాయకుడు కమల్ హాసన్ గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద స్థాయి విజయాలను అందుకోవడంలో చాలా వెనుకబడిపోయాడు. అలాంటి సమయం లోనే కమల్ హాసన్ "విక్రమ్" అనే సినిమాలో హీరో గా నటించాడు. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ స్థాయి విజయాన్ని అందుకోవడంతో ఒక్క సారిగా కమల్ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. అలా కమల్ ఫుల్ ఫామ్ లోకి వచ్చిన తర్వాత కొంత కాలం క్రితమే భారతీయుడు 2 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయింది.

ఇకపోతే కమల్ తాజాగా మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాను జూన్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం కమల్ , మణిరత్నం కాంబోలో నాయకుడు అనే సినిమా వచ్చి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. తాజాగా కమల్ థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ ... నేను హీరో గా మణిరత్నం దర్శకత్వం లో చాలా సంవత్సరాల క్రితం నాయకుడు అనే సినిమా వచ్చింది.

అది అద్భుతమైన విజయాన్ని సాధించింది. నాయకుడు సినిమాకు మించి థగ్ లైఫ్ మూవీ ఉంటుంది అని కమల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలా కమల్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇకపోతే కమల్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ విషయంలో కొంత మంది నాయకుడు రేంజ్ లో ఉంటేనే సినిమా బ్లాక్ బస్టర్ , అంతకు మించి అంటే మామూలు విషయం కాదు అని అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: