జయం రవితో ప్రస్తుతం కెనీషా రిలేషన్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరి రిలేషన్ పై సోషల్ మీడియా వేదికగా ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా చాలామంది సెలబ్రిటీలు కూడా ఆర్తి వైపే ఉన్నారు. దీంతో కెనీషా కూడా ఆ సెలబ్రిటీ లందరికీ వార్నింగ్ లు ఇస్తూ ఎవరు ఎలాంటి వారో ముందు తెలుసుకోవాలని,ఏదైనా ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడాలి అంటూ కౌంటర్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా కెనీషా తన సోషల్ మీడియా ఖాతాలో మరో సంచలన పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో ఏముందంటే.. చాలామంది ఆర్తికి సపోర్టుగా కెనీషాని బెదిరిస్తూ విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే కొంతమంది అయితే కెనీషాని చంపేస్తామంటూ హత్య బెదిరింపులు చేయడంతో వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ కెనీషా సంచలన పోస్ట్ పెట్టింది. నేను ఎక్కడికి పారిపోలేదు..

 కామెంట్ సెక్షన్ కూడా ఆఫ్ చేయలేదు. నేను మీ దగ్గరే ఉన్నాను. మీరందరూ నాకు కర్మ రిటర్న్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మీరు పెట్టే శాపనార్ధాల వల్ల నేను చాలా బాధపడుతున్నాను.కానీ అసలు నిజం తెలిసాక మీరు కూడా ఇలాంటి బాధ పడకూడదని నేను ఆ దేవున్ని కోరుకుంటున్నాను. నిజం తెలిస్తే మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని ఫీల్ అవుతారు. నిజం బయటికి తెలియాలనే నేను కూడా అనుకుంటున్నాను.ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను కోర్టులో హాజరుపరచండి. వాళ్ళు వేసే శిక్షను నేను ఆనందంగా స్వీకరిస్తాను. నేను ఏది దాచడం లేదు. మీ ముందు కనిపించే ప్రతి ఒక్క చర్యను నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఉంది. నా చుట్టూ జరిగే విషయాలకు నేనే బాధ్యురాలిగా మీరు అనుకుంటున్నారు. కానీ నిజం తెలిసిన నాడు మీరు తప్పుగా అర్థం చేసుకున్నట్టు భావిస్తారు.

నిజం త్వరగా బయటపడాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను.నా తప్పని తెలిస్తే నేను ఏ శిక్ష నైనా అనుభవిస్తాను.కానీ అప్పటి వరకు నన్ను ద్వేషించకుండా ఉండండి..నాకు కాస్త ప్రశాంతతను ఇచ్చి బతకనివ్వండి అంటూ కెనీషా చెప్పుకొచ్చింది.కెనీషా పోస్ట్ చూసి చాలా మంది నెటిజన్స్ కన్నడ నటుడు దర్శన్ పవిత్ర గౌడల వ్యవహారం వైరల్ అయింది. అందులో దర్శన్ తన ప్రియురాలు పవిత్ర గౌడ కోసం తన వీరాభిమాని అయినటువంటి రేణుక స్వామి పవిత్ర గౌడని అసభ్యంగా వేధిస్తున్నాడని తెలిసి మర్డర్ చేయించిన సంగతి మనకు తెలిసిందే. దీంతో ఈ మ్యాటర్ ని సోషల్ మీడియాలో మరోసారి వైరల్ చేస్తూ హత్య బెదిరింపులు వస్తున్నాయి కాబట్టి జయం రవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అంటూ కామెంట్స్ పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: