పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేయడానికి ఒక బ్యాచ్ ఎప్పుడు రెడీగా ఉంటుంది.  అది వ్యక్తిగతంగా కావచ్చు.. సినిమాల పరంగా కావచ్చు.. పొలిటికల్ పరంగా కావచ్చు . పవన్ కళ్యాణ్ అన్న పేరు కనపడితే చాలు డిస్ లైక్ కొట్టడానికి బూతు కామెంట్స్ చేయడానికి ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ వెయిట్ చేస్తూ ఉంటుంది.  రీసెంట్గా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ పై హ్యూజ్ నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది . దానికి కారణం ఆయన సినిమాలనే చెప్పాలి .


బాధ్యత గల డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవర్ స్టార్ ఎలా కొత్త సినిమాలకు కమిట్ అవుతాడు..? అంటూ జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు . నిజానికి పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక ఒక్కటంటే ఒక్క కొత్త సినిమాకి కూడా కమిట్ అవ్వలేదు. ఎక్కడ అఫిషియల్ ప్రకటన రాలేదు. ఉన్న సినిమాల కాల్ షీట్స్ ఫిల్ చేసుకుంటూ అవి కంప్లీట్ చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నాడు . త్వరలోనే పవన్ కళ్యాణ్ లాస్ట్ చిత్రానికి సంబంధించిన ప్రకటన కూడా రాబోతుంది అంటూ ఫిలిం సర్కిల్స్ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అయింది . వైరల్ గా మారింది.

 

అయితే సడన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమాలో కనిపించబోతున్నాడు అన్న వార్త తెరపైకి వచ్చింది. సాయిధరమ్ తేజ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు - పవన్ కళ్యాణ్ కాంబోలో త్రివిక్రమ్ శ్రీనివాసరావు ఒక సినిమాను చేయబోతున్నాడు అంటూ ఫిలిం సర్కిల్స్ ఓ న్యూస్ బయటకు రావడంతో సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ గా చేసి మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా కొంతమంది పవన్ సినిమాలోకి వచ్చి  తైతక్కలాడుతూ చిందులు వేస్తూ ఉంటే ఏపీ పరువు పోదా..? ఏపీలో బాధ్యత గల పొజిషన్లో ఉన్న నువ్వు సినిమాలకి గుడ్ బై చెప్పాలి ..నీ బాధ్యత ప్రకారం ప్రజాసేవ చేయాలి.. అదే కరెక్ట్ ప్రజాసేవ అంటూ సినీ ప్రేమ అంటూ రెండు పడవలపై ప్రయాణం చేస్తే ఎలా అంటూ కావాలనే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్లకి ఘాటు ఘాటుగా జవాబు ఇస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: