
పబ్లిక్ అపీరెన్స్ లోను బోల్డ్ నెస్ ఓవర్ లోడెడ్ అన్నట్టుగా ఉంటుంది నిధి లుక్ అపీరియన్స్ .. సోషల్ మీడియాలో ఈ రేంజ్ లో ఫామ్ చూపిస్తున్న ఆన్ స్క్రీన్ మీద మాత్రం సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు నిధి .నిధి అగర్వాల్ తో పాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ లో ప్రియాంక జవాల్కర్, నభా నటేష్ లుక్స్ పరంగా కాస్త సిమిలర్గా కనిపించే హీరోయిన్లు .. అయితే గ్లామర్ షో విషయంలో మాత్రం ముంబై హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. కెరీర్ మొదటిలో విజయ్ దేవరకొండకు జంటగా టాక్సీవాలా లాంటి సక్సెస్ వచ్చిన ప్రియాంక కెరియర్ మాత్రం సక్సెస్ ట్రాక్ లోకి రాలేదు .. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలంగాణ యాస్ తో అదరగొట్టిన నభాకి కూడా అవకాశాలు రావడం లేదు.
సోషల్ మీడియా పోస్టుతో గ్లామర్ కు నో లిమిట్స్ అనే విధంగా పోస్టులు పెడుతున్నారు రుహానీ , కేతిక .. వీరు చేసిన సినిమాలు నెంబర్ తొక్కవే అయినా తమకు సపరేట్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఈ ముద్దుగుమ్మలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో దుమ్ము లేపుతున్నారు .. సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం ఆ రేంజ్ లో అవకాశాలు అందుకోవటం లేదు .. బాలీవుడ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా లిస్ట్‌లోకి అడుగు పెట్టారు .. జస్ట్ అలా కన్ను కొట్టే సీన్‌తో పాపులర్ అయ్యారు ప్రియా .. నితిన్ చెక్ సినిమాతో సౌత్ లో ఎంట్రీ ఇచ్చారు . అయితే ఈ సినిమా ప్లాప్ అవటంతో మొదట్లోనే కెరియర్ కు గడ్డి బ్రేక్ పడింది ...ఇక దీంతో అవకాశాల కోసం రెగ్యులర్గా హైదరాబాద్లో కనిపిస్తున్న ప్రియా సోషల్ మీడియాలో కూడా ఎంతో యక్టివ్ గా ఉంటున్నారు.