
కానీ తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ కళ్యాణ్ అంత రెమ్యూనరేషన్ తీసుకోలేదనే విధంగా టాక్ వినిపిస్తున్నది. కేవలం ఈ సినిమా కోసం 11 కోట్ల రూపాయలు మాత్రమే తీసుకున్నారట. సినిమా కోసం భారీ డిమాండ్ చేయకుండా కేవలం నిర్మాత పరిస్థితిని అర్థం చేసుకొని మరి సహకరించారట. స్టార్ హీరోలు తమ రెమ్యూనరేషన్ తగ్గించే విషయం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు పదవిలో ఉండడమే కాకుండా సినిమాలలోకి వస్తున్న నిర్మాతలకు నష్టాలు రాకుండా ఉండేలా ఇలాంటి పని చేశారట. సినిమా కోసం చాలామంది నిర్మాతలు అప్పులు చేసి మరి సినిమాలను తీస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారని కథ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమా హిట్ అయ్యి లాభాలు వచ్చిన తర్వాత రెమ్యూనరేషన్ తీసుకునే విధంగా నిర్మాతలకు ఊరట కలిగించారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సినిమాలు థియేటర్లలో ఆడటం కష్టమని థియేటర్ల యాజమాన్యులు కూడా మూసివేయాలని ఆలోచనతో ఇటీవలే కొన్ని చర్చలు కూడా జరిపారు. అందుకే నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ సరికొత్త నాందికి తెర లేపారు.. మరి భారీ బడ్జెట్ చిత్రాలకు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకొనే హీరోలు పవన్ కళ్యాణ్ ఫిలాసఫీని పాటిస్తారా లేదా అన్నది చూడాలి. ఒకవేళ ఇలా పాటిస్తే నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.