చిత్ర పరిశ్రమ లో ఈ రీసెంట్ టైమ్స్ లో పెళ్లి భాజాలు ఎక్కువగా వినిపించాయి .. స్టార్ హీరోయిన్లు వరుసగా ఓ ఇంటి వారు అవుతున్నారు .. ఒక్కొక్కరిగా పెళ్లి చేసుకుంటూ మిస్ నుంచి మిస్సెస్ గా మారుతున్నారు .. అయితే ఇప్పుడు ఇదే ట్రెండ్ ఈ 2025 లో కూడా కంటిన్యూ అయ్యేలా కనిపిస్తుంది .. ప్రధానంగా ఈ ఏడాది మరో ముగ్గురు , నలుగురు స్టార్ హీరోయిన్స్‌ పెళ్లి చేసుకునేలా కనిపిస్తున్నారు .. మరి వారు ఎవరు అనేది ఈ స్టోరీలు చూద్దాం . ఇక మన చిత్ర పరిశ్రమలో గత రెండేళ్లలో కీర్తి సురేష్ , రకుల్ , కాజల్ ఇలా చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు .. ఇప్పుడు ఈ 2025 లో కూడా ఇదే సీన్ కనిపించేలా కనిపిస్తుంది .


అయితే ఇప్పుడు ఈ రేసులో అందరికంటే ముందు ఉంది తమన్నానే .  అన్నీ అనుకున్నట్టు కుదిరితే ఇదే సంవత్సరం ఈ బ్యూటీ పెళ్లి చేసుకోవడం ఖాయం .. అయితే కొన్ని రోజులు గా బాలీవుడ్ నటుడు విజయవర్మతో డేటింగ్ చేస్తున్న తమన్న .. ఈ ఇద్దరు కలిసి లస్ట్ స్టోరీస్ 2లో నటించారు కూడా ఇందులో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంతో అద్భుతంగా వర్కౌట్ అయింది .. త్వరలోనే తమన్న , విజయ్ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం కూడా జరుగుతుంది .అలాగే మరో పక్క బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ కూడా తన లవర్  శిఖర్ పహారియా ను పెళ్లి చేసుకుని అవకాశం కూడా ఉంది ..



 ప్రియుడితో కలిసి పూజలు చేయడమే కాదు తిరుమల కు కూడా వచ్చి వెళ్తున్నారు జాన్వీ కపూర్ .. ఈ 2025 లోనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది . మరో స్టార్ బ్యూటీ రష్మిక మందన్నా పెళ్లి పై కూడా గట్టి రచ్చ జరుగుతుంది .. ఓ టాలీవుడ్ స్టార్ హీ తో ఈమె ప్రేమలో ఉందనే విషయం నిర్మాత నాగ‌ వంశీ కూడా గతంలో చెప్పుకొచ్చారు .  ఈ బ్యూటీ కూడా ఈ సంవత్సరమే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి .. ఇక మరి పైన చేప్పిన‌ ముగ్గురు హీరోయిన్లలో ఈ ఏడాది ఎవరు పెళ్లి చేసుకున్ని ఫ్యామిలీ లైఫ్ లో అడుగు పెడతారు అనేది చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: