తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో శంకర్ ఒకరు. ఈయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు దేశ వ్యాప్తంగా అద్భుతమైన ప్రజాదరణ పొందాయి. దానితో దర్శకుడిగా శంకర్ కి సూపర్ సాలిడ్ గుర్తింపు వచ్చింది. ఇలా దేశ వ్యాప్తంగా ఎంతో గొప్ప గుర్తింపును దర్శకుడిగా సంపాదించుకున్న శంకర్ ఈ మధ్య కాలంలో మాత్రం తన రేంజ్ సినిమాలు చేయట్లేదు అనే అభిప్రాయాలను అనేక మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆఖరుగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈయన దర్శకత్వం వహించిన అనేక సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర ఘోర పరాజయాలను అందుకున్నాయి.

ఇకపోతే శంకర్ ఆఖరుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్గా గేమ్ చేంజర్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పరాజయాన్ని ఎదుర్కొంది.

ఇకపోతే తాజాగా ఈ సినిమా గురించి , ఈ మూవీ కి దర్శకుడిగా వ్యవహరించిన శంకర్ గురించి , ఈ మూవీ కి మొదట ఎడిటర్ గా పని చేసిన షమీర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా షామీర్ మాట్లాడుతూ ... గేమ్ చేంజర్ సినిమా మొదట ఏడున్నర గంటల ఫుటేజ్ వచ్చింది. దాన్ని నేను మూడు గంటలకు తగ్గించాను. కానీ శంకర్ దర్శకత్వ శైలి నాకు నచ్చలేదు. ఆ సినిమా నాకు దారుణ అనుభవం అని షమీర్ తాజాగా చెప్పుకొచ్చాడు. షమీర్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: