ప్రముఖ నటి మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ భామ మొదట మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. అనంతరం 2013లో మలయాళం సినిమా "పట్టం పోల్" సినిమాతో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా అనంతరం వరసగా సినిమాలు చేసుకుంటూ పోయింది. తన నటన, అందంతో విపరీతంగా అభిమానులను సంపాదించుకుంది. కేవలం మలయాళంలోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ, తెలుగు లాంటి అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు పఖ్యాతలు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ చిన్నది వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. 


తెలుగులో ప్రస్తుతం "ది రాజా సాబ్" సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ది రాజాసాబ్ సినిమాకు స్టార్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం ది రాజాసాబ్ సినిమా కావడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను తొందరలోనే రిలీజ్ చేయాలని మారుతి భావిస్తున్నారట. ఈ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ ను వేగంగా జరుపుతున్నారు.


ఈ సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ మాళవిక మోహనన్ హీరో ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది. ప్రభాస్ గురించి నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నానని అన్నారు. ప్రభాస్ ఇంటర్వ్యూలను చూసి అతను ఎవరితో పెద్దగా కలవరని అనుకున్నాను. కానీ సెట్ లోకి అడుగుపెట్టిన అనంతరం హీరో ప్రభాస్ గురించి నేను అనుకున్నవన్నీ తప్పని అనిపించింది. ప్రభాస్ అందరితో చాలా క్లోజ్ గా ఉంటాడు. కానీ ఇంటర్వ్యూలు, ఈవెంట్లకు వచ్చేసరికి కాస్త మొహమాటంగా కనిపిస్తాడని మాళవిక మోహనన్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసుకున్న ఈ విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: