జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధారణంగా కూల్ గా ఉంటారు. అయితే హరిహర వీరమల్లు సినిమా విషయంలో కుట్ర జరుగుతోందని తన దృష్టికి రావడంతో పవన్ ఒకింత ఘాటుగా స్పందించిన కామెంట్లు నెట్టింట వైరల్ అయ్యాయి. టాలీవుడ్ కు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. పవన్ తన అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసి పరోక్షంగా ఫైర్ అయ్యారు.
 
పవన్ మాస్ వార్నింగ్ తో టాలీవుడ్ నిర్మాతల గుండె గుభేల్ అనిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ లో నివాసం ఉండే ఒక కమర్షియల్ ప్రొడ్యూసర్, ఒక టాప్ ప్రొడ్యూసర్ సోదరుడు ఈ వివాదానికి కారణమని తెలుస్తోంది. తమ స్వలాభం కోసం వీళ్లు థియేటర్ల బంద్ దిశగా అడుగులు వేశారని భోగట్టా. ఇన్నిరోజులు లేని సమస్యలు ఇప్పుడు మొదలు కావడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
వాస్తవానికి రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన పరిస్థితి పూర్తిస్థాయిలో మారిపోయింది. పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడాల్లేకుండా అన్ని సినిమాలకు టికెట్ రేట్ల పెంపు అమలవుతోంది. తండేల్, మ్యాడ్2 సినిమాలు సైతం ఈ టికెట్ రేట్ల పెంపు వల్ల అంతో ఇంతో బెనిఫిట్ పొందాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.
 
అయితే ఇద్దరు నిర్మాతల స్వార్థానికి ఇప్పుడు ఇండస్ట్రీ బలి పశువు అయిందని చెప్పవచ్చు. ఈ నిర్ణయం వల్ల తాత్కాలికంగా ఎలాంటి ఇబ్బంది లేకపోయినా దీర్ఘకాలంలో పెద్ద సినిమాలకు ఇబ్బందులు తప్పవు. పుష్ప2 సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రావడానికి టికెట్ రేట్ల పెంపు కారణమని చెప్పవచ్చు. ఇప్పటికే నైజాంలో టికెట్ రేట్ల పెంపు ఆగిపోగా ప్రస్తుతం ఏపీలో సైతం అదే పరిస్థితి రానుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి భవిష్యత్తులో మరిన్ని షాకులు తప్పేలా లేవు.


మరింత సమాచారం తెలుసుకోండి: