సినిమా ఇండస్ట్రీకి కొత్తగా ఎవరో సమస్యలను సృష్టించాల్సిన అవసరం లేదని కొత్త సమస్యలను తామే సృష్టించుకోగలమని చాలా సందర్భాల్లో ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు ప్రూవ్ చేస్తుంటారు. థియేటర్ల బంద్ అంటూ ఏదో చేయాలని ప్రయత్నించిన నిర్మాతలు కమ్ ఎగ్జిబిటర్లకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనతో కళ్లు బైర్లు కమ్మాయి. ఏదో ఆశించి ముందుకెళ్తే ఇంకేదో జరిగింది.
 
చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదనే విధంగా ఇప్పుడు నిర్మాతలు ఏం చేసినా ఫలితం ఉండదని చెప్పవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటన గురించి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరైన నాగవంశీ స్పందించారు. పర్సంటేజ్ సిస్టమ్ కు వ్యతిరేకంగా అడుగులు వేస్తున్న ఈ నిర్మాత ఇండస్ట్రీ వాళ్లకు గడ్డి పెట్టే విధంగా రియాక్ట్ అవ్వడం నెట్టింట సంచలనం అవుతోంది.
 
పెద్ద సమస్యలను పరిష్కరించడానికి దృష్టి పెట్టాల్సిన తరుణంలో అనవసర సమస్యలను సృష్టించారని నాగవంశీ అన్నారు. ఇప్పుడు ఆ సమస్యలే పెద్దవయ్యాయని ఆయన చెప్పుకొచ్చారు. కామన్ సెన్స్ తో ఆలోచించి ఉంటే ఈ తరహా సమస్యలు వచ్చేవి కావని నాగవంశీ అభిప్రాయం వ్యక్తం చేశారు. పవర్ స్టార్ ప్రకటనపై నాగవంశీ ఘాటు రియాక్షన్ వైరల్ అవుతోంది.
 
ఈ వివాదం విషయంలో తప్పు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లదే, ఎగ్జిబిటర్లదే అని నాగవంశీ కామెంట్ల ద్వారా క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికైనా ఇండస్ట్రీ ఏకతాటిపైకి వచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి సమస్యకు సానుకూల పరిష్కారం దిశగా అడుగులు వేస్తే బాగుంటుంది. లేని సమస్యను సృష్టించి థియేటర్లు బంద్ చేస్తామంటే మాత్రం ఇండస్ట్రీ ఎప్పటికీ బాగు పడదని కచ్చితంగా చెప్పవచ్చు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: