
ముఖ్యంగా ఈసారి తిరుమల తిరుపతి బ్యాక్ డ్రాప్ లో లెనిన్ సినిమాలు హైలెట్స్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతానికి తగ్గట్టుగానే భారీ సెట్ తో నిర్మిస్తున్నారట. తిరుమల కొండల నేపథ్యంలో సాగే ఈ సన్నివేశం సినిమాకి హైలైట్ గా ఉంటుందని సినిమా నిలబడడానికి ఇదే కారణం అవుతుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీన్ తర్వాత ఒక యాక్షన్ ఎపిసోడ్ ని కూడా చిత్రీకరించబోతున్నారు. లెనిన్ సినిమా కోసం హీరో అఖిల్ కూడా చాలా కష్టపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
లెనిన్ సినిమాలోని ఎంట్రీ సన్నివేశం కోసం అభిమానులకు ఒక సర్ ప్రైజ్ విజువల్ ట్రీట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. గతంలో ఏజెంట్ సినిమా ఫ్లాప్ కావడంతో అఖిల్ లెనిన్ సినిమా పైన పూర్తిగా ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. చిత్తూరు యాసలో మాట్లాడడం కోసం ప్రత్యేకించి మరి శిక్షణ తీసుకున్నారట అఖిల్. శ్రీలీల అఖిల్ కాంబినేషన్లో వచ్చే లవ్ సన్నివేశాలు కూడా ఈ సినిమాకి మరింత ఆకట్టుకునేలా ఉంటాయని.. సంగీతం థమన్ కూడా అద్భుతంగా అందించబోతున్నారు. మరి అఖిల్ కెరీర్ ని మలుపు తిప్పేలా లెనిన్ సినిమా ఉంటుందనే విధంగా అభిమానులు భావిస్తున్నారు. మరి అభిమానుల అంచనాలను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.