టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్స్ అనగానే అందరికీ బాగా గుర్తొచ్చే నాలుగే నాలుగు పేర్లు మెగాస్టార్ చిరంజీవి .. నందమూరి బాలయ్య .. విక్టరీ వెంకటేష్ .. అక్కినేని నాగార్జున . టాలీవుడ్ ఇండస్ట్రీకి నలుగురు పిల్లర్స్ లా నిలుచున్నారు అని చెప్పడంలో సందేహమే లేదు . ఒక హీరో ఫ్లాప్ కొడితే మరొక హీరో హిట్ కొట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ పరువు ప్రతిష్టలను కాపాడుతూ వచ్చారు. చాలా మంది ఈ నలుగురు లేకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీకి అసలు అడ్రస్ కూడా ఉండేది కాదు అంటూ గర్వంగా ఇండస్ట్రీ తల ఎత్తుకునేలా చేసారు అని చెప్పుకొచ్చారు .


కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ న్యూస్ ఇంట్రెస్టింగ్గా మారింది . ఇప్పటివరకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ముగ్గురు సీనియర్ హీరోస్ సినిమాలలో నటించారు అని .. ఇక మిగిలింది నాగార్జున మాత్రమేనని . నాగార్జున కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను ఓకే చేస్తే అనిల్ రావిపూడి స్పెషల్ క్రేజీ రికార్డ్ ను నెలకొల్పినట్లు అవుతాడు అని మాట్లాడుకుంటున్నారు . ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి వచ్చిన డైరెక్టర్లలో అనిల్ రావిపూడి చాలా ఫాస్ట్ గా దూసుకుపోతున్నాడు. మరీ ముఖ్యంగా సీనియర్ హీరో వెంకటేష్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు  తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ మూవీస్ ఇచ్చారు .



ఎఫ్2 .. ఎఫ్3 .. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఏ విధమైనటువంటి టాక్ అందుకున్నాయో అందరికీ తెలిసిందే . బాలకృష్ణతో భగవంత్ కేసరి అనే సినిమాను తెరకెక్కించి 100 కోట్ల హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . ఇప్పుడు చిరంజీవిని డైరెక్టర్ చేయబోతున్నాడు . నో డౌట్ ఈ సినిమా 100 కోట్లు కన్ఫామ్ అని మెగా ఫాన్స్ నోటితోనే చెప్పించే రేంజ్ ప్రమోషన్స్ అప్పుడే స్టార్ట్ చేసేసారు . ఇప్పుడు నాగార్జున మాత్రమే మిగిలి ఉన్నాడు . అనిల్ రావిపూడి నెక్స్ట్ నాగార్జున ని  డైరెక్ట్ చేస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త చరిత్ర సృష్టించిన వాడు అవుతాడు. అనిల్ రావిపూడి కి ఆ దమ్ము ఉంది అని  ఓ రేంజ్ లో ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.  నిజమే నాగార్జునను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తే మరొక మన్మధుడు లాంటి హిట్ నాగార్జున ఖాతాలో పడినట్లే . ప్రెసెంట్ నాగార్జున - కార్తీక్ దర్శకత్వంలో 100వ సినిమాని ఫైనలైజ్ చేసుకున్నాడు . తర్వాత అయినా అనిల్ కి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అంటున్నారు అభిమానులు . చూద్దాం ఏం జరుగుతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: