టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చాలా కాలం క్రితం ప్రారంభం అయింది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయినప్పుడు ఈ మూవీ కి క్రిష్ జాగర్లమూడి మూడు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా షూటింగ్ పలుమార్లు ఆగిపోతూ స్టార్ట్ అవుతూ ఉండడంతో ఈ మూవీ దర్శకత్వ బాధ్యతల నుండి క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నాడు.

దానితో ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన షూటింగ్ను జ్యోతి కృష్ణ అనే దర్శకుడు పూర్తి చేశాడు. నీది అగర్వాల్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంకేతం అందించాడు. ఏ ఏం రత్నం ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమాను జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ కి సంబంధించిన థియేటర్ హక్కులను అమ్మే పనిలో ఈ మూవీ నిర్మాతలు పడిపోయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా యొక్క నైజాం హక్కులకు ఈ మూవీ మేకర్స్ ఏకంగా 50 కోట్ల ధర కోడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

50 కోట్ల ధరకు ఈ సినిమా నైజాం ఏరియా థియేటర్ హక్కులను ఎవరైనా కొనుగోలు చేసినట్లయితే ఈ మూవీ నైజాం ఏరియాలో దాదాపు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధిస్తే ఈ మూవీ ఆ ఏరియాలో హిట్ స్టేటస్ను అందుకునే అవకాశాలు ఉంటాయి. దానితో చాలా మంది నైజాం ఏరియాలో ఈ మూవీ ని ఎవరైనా 50 కోట్ల ధరకు కొనుగోలు చేస్తే ఈ మూవీ బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంటేనే ఆ స్థాయి కలెక్షన్లను రికవరీ చేయగలదు అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: