మెగాస్టార్ చిరంజీవి తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ ని మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాకు మేకర్స్ టైటిల్ ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ యొక్క షూటింగ్ను మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రారంభించారు. ఈ సినిమాను స్టార్ట్ చేయకముందే ఈ మూవీ కి సంబంధించిన ప్రమోషన్లను ఈ మూవీ దర్శకుడు అని రావిపూడి మొదలు పెట్టాడు. ఈ మూవీ ప్రమోషన్లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ కూడా లభిస్తుంది. ఈ సినిమాలో నయనతార , చిరంజీవి కి జోడిగా కనిపించనుంది.

ఈ విషయాన్ని కూడా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. దానికి కూడా మంచి రెస్పాన్స్ కూడా జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ తాజాగా ప్రారంభం అయింది. ఈ మూవీ యొక్క షూటింగ్ను హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశంతో మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశానికి నబకాంట మైటీ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... శివరాజ్ కుమార్ , జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి కూడా యాక్షన్ కొరియోగ్రాఫర్ గా నబకాంట మైటీ పని చేస్తున్నాడు. ఇలా చరణ్ సినిమాకు పని చేస్తున్న టెక్నీషియన్ ను అనిల్ రావిపూడి మెగా 157 కోసం రంగం లోకి దించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: