
టాలీవుడ్ లో ఇద్దరూ ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యేల మధ్య అదిరిపోయే సినిమా వార్ కు తెరలేచింది. టాలీవుడ్ లో ఈ ఏడాది సమ్మర్ సీజన్లో సినిమా వాళ్ళు సక్రమంగా వినియోగించుకోలేదు. జూన్ నుంచి వరుస పెట్టి పెద్ద హీరోలు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ 2 సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తవుతుంది. జార్జియాలో జరిగే షెడ్యూల్ తో సినిమా మొత్తం పూర్తవుతుందని మేకర్ చెప్తున్నారు. సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా బాలయ్య - బోయపాటి కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో అఖండ 2 మీద అంచనాల మామూలుగా లేవు. ఇదిలా ఉంటే దసరా సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను కూడా సెప్టెంబర్ 25న విడుదలవుతుందని ప్రకటన వచ్చింది.
దీంతో అఖండ 2 విడుదల వాయిదా పడుతుందా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఈ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో రెండు ప్రధాన పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బాలయ్య సినిమా రిలీజ్ డేట్ వేసినా కూడా పవన్ కళ్యాణ్ సినిమాను అదే డేట్కు రిలీజ్ చేస్తామని ఎందుకు ప్రకటిస్తారు ? అన్న చర్చ కూడా తెరమీదకి వచ్చింది. ఒకే రోజున తెలుగుదేశం, జనసేన పార్టీల ఎమ్మెల్యేల సినిమాలను రిలీజ్ చేస్తే ఒప్పుకోరని అంటున్నారు. అఖండ 2 దసరాకు రాదన్న నిర్ధారణకు వచ్చే ఓజి సినిమా నిర్మాత దానయ్య రిలీజ్ డేట్ ప్రకటించారని ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి దుర్గా తీసినట్టు ఇస్తున్న పాన్ ఇండియా మూవీ సంబరాల ఏటిగట్టు కూడా దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు