టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ .. ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం ఎంతో కాలంగా ఎదురు చేస్తున్నాడు .. లైగర్ , డబుల్ ఇస్మార్ట్  వంటి భారీ డిజాస్టర్స్‌ తర్వాత తన కొత్త సినిమా బెగ్గర్ ని కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి తో పూరి ప్రకటించాడు ..  అలాగే ఈ సినిమా లో సీనియర్ బ్యూటీ టబు కూడా ఒ కీలక్క పాత్రలో నటించబోతుంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా లో మరో స్టార్ క్యామియో కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది .. ఇక ఆ క్యామియో రోల్ లో నాగార్జున నటించబోతున్నట్లు తాజాగా  పలు రూమర్లు గట్టిగా వినిపిస్తున్నాయి .. ఇక గతంలో నాగార్జున , పూరి కాంబోలో సూపర్ , శివమణి లాంటి హిట్ సినిమాలు వచ్చాయి ..


ఇక ఇప్పుడు విజయ్‌ సేతుపతి బెగ్గర్ లో నాగార్జున గెస్ట్ రోల్ లో నటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు గట్టిగా అంటున్నాయి .. అయితే ఈ వార్త పై ఇంకా ఎలాంటి అధికార ప్రకటన రాలేదు .. అయితే ఇప్పుడు పూరీ మొత్తానికి ఈసారి కొత్తగా ఏదో ట్రై చేయడానికి చూస్తున్నాడు .. అయితే గతంలో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ ఆశించిన స్థాయి లో మెప్పించలేకపోయింది .. అలాగే ప్రధానంగా పూరి గ‌త‌ సినిమాల తో పోల్చుకుంటే ఈ సినిమా లో బలమైన కంటెంట్ బాగా మిస్ అయింది అంటూ విమర్శలు కూడా వచ్చాయి .. అయితే ఇప్పుడు ఈ నేపథ్యం లో పూరి , విజయ్ సేతుపతి కోసం ఎలాంటి స్టోరీ ని రెడీ చేసాడు అనే దాని పై అందరిలో గట్టి ఆసక్తి నెలకొంది .


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: