సుమంత్ హీరోగా నటించిన అనగనగా మూవీ ఈటీవీ ఓటీటి లో మే న స్ట్రీమింగ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలోని ఎమోషన్స్ కి చాలా మంది ఫిదా అయిపోతున్నారు. అలా ఓటిటిలో సక్సెస్ అవ్వడంతో ఈ సినిమాని థియేటర్లో నేరుగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే చాలా సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాక ఓటీటిలో స్ట్రీమింగ్ అవుతాయి. కానీ ఇలాంటి కొన్ని స్పెషల్ సినిమాలు మాత్రమే ఓటిటిలో సక్సెస్ అయ్యాక వాటిని థియేటర్లో కూడా చూడాలి అనుకుంటారు అభిమానులు. అలా సుమంత్ అనగనగా మూవీ పేరు తెచ్చుకుంది. చాలా రోజుల నుండి హీరోగా సినిమాలకు దూరంగా ఉంటున్న సుమంత్ మళ్లీ అనగనగా మూవీ తో కమ్ బ్యాక్ అయ్యారని ఎంతోమంది అక్కినేని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.అయితే తాజాగా అనగనగా మూవీలో నటించిన హీరోయిన్ కాజల్ చౌదరి బ్యాక్ గ్రౌండ్ గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఎక్కడి నుండి వచ్చింది.. సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.. 

అనగనగా మూవీ తో పాటు నవీన్ చంద్ర హీరోగా చేస్తున్న కరాలి అనే మూవీ లో కూడా హీరోయిన్ గా కాజల్ చౌదరి ఛాన్స్ అందుకుంది. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మరో సినిమాలో కూడా కాజల్ చౌదరి చేస్తోంది.అయితే తెలుగులో ఫస్ట్ సినిమా నే ఓ అబ్బాయికి తల్లి పాత్రలో నటించింది.ఇక అనగనగా మూవీ లో కాజల్ చౌదరి ప్రిన్సిపాల్ గా..సుమంత్ కు భార్యగా.. ఓ బిడ్డకు తల్లిగా.. మంచి పాత్ర పోషించింది. ఇక కాజల్ చౌదరి బ్యాగ్రౌండ్ విషయానికి వస్తే.. ఆమె బీహార్ కి చెందిన అమ్మాయి. మొదట స్టడీస్ మీద ఇంట్రెస్ట్ తో కాన్పూర్ లో ఎలక్ట్రికల్ బ్రాంచ్ నుండి ఇంజనీరింగ్ పట్టా పొందింది. ఆ తర్వాత పైలెట్ అవ్వాలని ఎన్నో కలలు కంది.

కానీ అప్పటికే మోడలింగ్ చేయడంతో మిస్ యూనివర్స్ బీహార్ గా కిరీటం కూడా అందుకుంది. అలా పైలెట్ అవ్వాలి అనుకున్న ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ లోకి అడుగుపెట్టి కిరీటం అందుకోవడంతో సినిమాల మీద ఇంట్రెస్ట్ తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది.అలా మొదట కోలివుడ్ హీరోతో సినిమాలోకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తెలుగులో సుమంత్ హీరోగా నటించిన అనగనగా మూవీతో ఎంట్రీ ఇచ్చింది. అలా తెలుగులో ఫస్ట్ సినిమానే కాజల్ చౌదరికి మంచి హిట్ తెచ్చి పెట్టడంతో ఈమెకు సౌత్లో మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు. అలా పైలెట్ అవుదామని వచ్చి ఫైనల్ గా సౌత్ లో హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: