అయితే దర్శకుడు హను రాఘవపూడికి ప్రభాస్ వార్నింగ్ ఇచ్చారని ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. సెట్ లో కూల్ గా ఉండాలని ప్రభాస్ హను రాఘవపూడికి చెప్పారని తెలుస్తోంది. హను రాఘవపూడి తన కెరీర్ లో గతంలో ఏ సినిమాకు కష్టపడని స్థాయిలో ఈ సినిమాకు కష్టపడుతున్నారు. ఒకింత భారీ స్థాయిలో, భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
ప్రభాస్ ఈ సినిమాకు 120 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. హను రాఘవపూడి అవుట్ పుట్ కోసమే కష్టపడుతున్నా కూల్ గా కూడా ఆ పని చేయవచ్చని ప్రభాస్ సూచించారని సమాచారం అందుతోంది. అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే మాత్రం ప్రభాస్, హను రాఘవపూడిలలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంటుంది.
హను రాఘవపూడి ఫౌజీ సినిమాతో సక్సెస్ సాధిస్తే ఈ దర్శకుడి స్థాయి ఎన్నో రెట్లు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. హను రాఘవపూడి కెరీర్ లో హిట్లు ఉన్నాయి ఫ్లాపులు ఉన్నాయి. అయితే సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఈ దర్శకుడు మరిన్ని విజయాలను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. హను రాఘవపూడిని అభిమానించే ఫ్యాన్స్ సైతం ఎక్కువగానే ఉన్నారు. స్టార్ దర్శకుడు హను రాఘవపూడి ప్రభాస్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి