టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. అఖిల్ కెరీర్ లో ఇప్పటివరకు సరైన హిట్ లేకపోయినా ఈ హీరోను అభిమానించే ఫ్యాన్స్ మాత్రం భారీ స్థాయిలోనే ఉన్నారు. అఖిల్ కొత్త సినిమా లెనిన్ పై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమాతో అఖిల్ కచ్చితంగా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టాలీవుడ్ టాప్ బ్యానర్లలో అఖిల్ సినిమాలు తెరకెక్కుతుండటం గమనార్హం.
 
అయితే గతేడాది నవంబర్ 26వ తేదీన అఖిల్ జైనబ్ నిశ్చితార్థ వేడుక జరగగా అఖిల్ పెళ్లి వార్త కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు అఖిల్ పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. జూన్ నెల 6వ తేదీన అఖిల్ జైనబ్ పెళ్లి పీటలెక్కనున్నారని సమాచారం. పెళ్లికి మరో 10 రోజుల సమయం మాత్రమే ఉండగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించి అతి త్వరలో మరిన్ని వివరాలు తెలిసే చాన్స్ ఉంది.
 
జైనబ్ ప్రముఖ వ్యాపారవేత్త జాల్ఫీ రవ్ డ్జీ కూతురు అనే సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత అఖిల్ కు కెరీర్ పరంగా కూడా కలిసొస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అఖిల్ పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. చైతన్య శోభిత పెళ్లి కొంతకాలం క్రితం జరగగా పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ అన్యోన్యంగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ జోడీ శుభవార్త చెబుతారని వార్తలు వినిపిస్తున్నాయి.
 
కొన్ని నెలల గ్యాప్ లోనే అక్కినేని ఫ్యామిలీలో మరో శుభకార్యం జరగనుండటం ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తోంది. జూన్ నెలలో నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కిన కుబేర సినిమా రిలీజ్ కానుంది. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నాగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని భోగట్టా. అఖిల్ కెరీర్ పరంగా సక్సెస్ సాధించి సంచలన విజయాలను అందుకుంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.


మరింత సమాచారం తెలుసుకోండి: