మన దేశంలో పసిడిని ఇష్టపడే జనాభా ఎంతో ఎక్కువగా ఉంటుంది. బంగారం కొనుగోలు మన దేశ ప్రజలు సంపదలా మాత్రమే కాకుండా సమాజం లో ఒక మంచి గుర్తింపుగా కూడా చూస్తూ ఉంటారు. దానితో భారత దేశంలో అనేక మంది , అనేక సందర్భాలలో బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. దానితో ప్రపంచం లోనే అత్యంత ఎక్కువ బంగారం కొనుగోలు చేసిన వారిలో ఇండియా అద్భుతమైన స్థానంలో ఉంది. ఇకపోతే గత కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడ్డ సంక్షోభాల కారణంగా బంగారం ధర భారీగా పెరిగిపోయింది.

దానితో కొత్తగా బంగారం కొనాలి అనుకునే వారు భయపడుతున్నారు. ఎప్పుడు బంగారం ధరలు తగ్గుతాయా ..? ఎప్పుడు బంగారం కొందామా అని అనేక మంది పసిడి ప్రియలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ఈ రోజు బంగారం కొనుగోలు చేయడానికి కాస్త అనువైన రోజుగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ రోజు కాస్త బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు అనగా మే 27 వ తేదీన మంగళవారం ఉదయం వరకు కొన్ని వెబ్ సైట్స్ లలో నమోదైన బంగారం , మరియు వెండి ధరల ప్రకారం ...  24 క్యారెట్స్ బంగారం ధర 97,630 రూపాయలుగా ఉండగా , 22 క్యారెట్ల బంగారం ధర 89,490 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల బంగారం పై రూపాయలు 10 మేర వరకు తగ్గింది.

వెండి ధర రూపాయలు 100 పెరిగి 1,00,100 రూపాయలుగా ఉంది. ఇకపోతే హైదరాబాదులో ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 97,630 రూపాయలుగా ఉండగా , 22 క్యారెట్ల బంగారం ధర 89,490 రూపాయలుగా ఉంది. మరో వైపు కిలో వెండి ధర ఈ రోజు హైదరాబాదు నగరంలో 1,11,100 గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: