యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీ సినిమా అయినటువంటి వార్ 2 లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే మే 20 వ తేదీన తారక్ పుట్టిన రోజు కావడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. దానితో కొంత మంది వార్ 2 టీజర్ ప్రేక్షకులను నిరాశ పరిచింది అనే అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ వచ్చారు. కాకపోతే ఈ సినిమా టీజర్ అదిరిపోయే రేంజ్ రికార్డ్ ను ఓ విషయంలో నెలకొల్పింది. ఈ సినిమా తెలుగు వర్షన్ టీజర్ యూట్యూబ్ లో ఏకంగా 126 గంటల పాటు నెంబర్ 1 ట్రెండింగ్లో కొనసాగింది.

ఇకపోతే ఈ మూవీ టీజర్ టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల టీజర్ రికార్డులను కూడా బద్దలు కొట్టింది. మహేష్ హీరోగా రూపొందిన సరిలేరు నీకెవ్వరు మూవీ టీజర్ యూట్యూబ్ లో 123 గంటల పాటు నెంబర్ 1 ట్రెండింగ్ లో కొనసాగితే , రామ్ చరణ్ హీరో రూపొందిన గేమ్ చేంజర్ మూవీ టీజర్ యూట్యూబ్ లో 123 గంటల పాటు ట్రెండింగ్లో కొనసాగింది. ఈ రెండు మూవీ ల టీజర్ రికార్డులను క్రాస్ చేస్తూ వార్ 2 మూవీ తెలుగు వర్షన్ టీజర్ 126 ప్లస్ గంటల పాటు యూట్యూబ్లో నెంబర్ 1 ట్రెండింగ్ లో కొనసాగింది. ఇలా ఈ మూవీ టీజర్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినా కూడా వాటిని ఈ మూవీ టీజర్ బద్దలు కొడుతూ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: