టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి మూవీ ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఒకరు అయినటువంటి అట్లీతో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబో మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాగే వీరి కాంబో మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేస్తూ రిలీజ్ చేసిన వీడియో అద్భుతమైన రేంజ్ లో వైరల్ అయింది. దానితో ఈ సినిమాపై ఒక్క సారిగా ఈ మూవీపై అంచనాలు తారా స్థాయికి పెరిగిపోయాయి.తాజాగా బన్నీ , అట్లీ కాంబోకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. బన్నీ , అట్లీ కాంబో మూవీకి ఐకాన్ అనే టైటిల్ను మేకర్స్ అనుకుంటున్నట్లు , అన్ని ఓకే అయితే ఇదే టైటిల్ను ఫిక్స్ చేసి మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఐకాన్ అనే టైటిల్ తో అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు ఓ మూవీ ని ప్లాన్ చేశాడు.

పుష్ప సినిమా స్టార్ట్ కావడానికి ముందు పుష్ప మూవీ పూర్తి కాగానే ఐకాన్ అనే టైటిల్ తో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్లో అల్లు అర్జున్ హీరోగా ఓ మూవీ రూపొందే అవకాశాలు కూడా ఉన్నట్లు బలంగా వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ కాంబోలో మూవీ మాత్రం సెట్ కాలేదు. ఇకపోతే ఏదో ఒక సమయానికి ఐకాన్ అనే టైటిల్ తో దిల్ రాజు , అల్లు అర్జున్ తో సినిమా చేస్తాడు అని కూడా చాలా మంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఐకాన్ అనే టైటిల్ను అల్లు అర్జున్ వేరే నిర్మాత నిర్మించనున్న సినిమాకు ఫిక్స్ చేశాడు అనే వార్తలు బలంగా వస్తూ ఉన్నాయి. మరి నిజంగానే బన్నీ , అట్లీ కాంబో మూవీకి ఐకాన్ అనే టైటిల్ను ఫిక్స్ చేస్తారా ..? లేక వేరే ఏదైనా టైటిల్ను ఫిక్స్ చేస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: