టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు తాజాగా సింగల్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కేతికా శర్మ , ఇవానా హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ కొన్ని ప్రజల క్రితం విడుదల అయ్యి మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు ఇప్పటికే దక్కాయి. ఈ సినిమా విడుదల అయిన తర్వాత అనేక వీక్ డేస్ వచ్చాయి. ఆ వీక్ డేస్ లో కూడా ఈ మూవీ సూపర్ సాలిడ్ కలెక్షన్లను రాబడుతుంది. ఇప్పటివరకు ఈ మూవీ కి సంబంధించిన 17 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 17 రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటివరకు ఈ మూవీ కి ఎన్ని లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ పై మొదటి నుండి కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడంతో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 6.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ మూవీ ఏడు కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటివరకు 17 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు నైజాం ఏరియాలో 5.70 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 1.49 కోట్లు , ఆంధ్ర లో 5.92 కోట్లు , కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్ సీస్ లో కలుపుకొని 3.71 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 16.82 కోట్ల షేర్ ... 32.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. దానితో ఇప్పటివరకు ఈ సినిమాకు 9.82 కోట్ల లాభాలు వచ్చాయి. దానితో ఈ మూవీ ఇప్పటికే అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sv