మలయాళం స్టార్ హీరోగా పేరు సంపాదించిన  ఉన్ని ముకుందన్ ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం వార్తలలో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఈ నటుడు పైన పోలీస్ కేసు నమోదు అయినట్లుగా సమాచారం. తన పైన దాడి చేశారంటూ అతని మేనేజర్ విపిన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారట. కొచ్చిలోని తన అపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత హీరో ఉన్ని ముకుందన్ తన పైన దాడి చేశారంటూ పోలీసులను ఆశ్రయించారు. గత కొద్ది రోజుల నుంచి హీరో ఉన్ని ముకుంద న్ నుంచి తనకు వేధింపులు వస్తున్నాయని ఫిర్యాదులో తెలియజేశారు.


అతడి ఫిర్యాదు ఆధారంగా నటుడు ఉన్ని ముకుందన్ పైన పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే మరొక హీరో అయిన టోవినో థామస్ నటించిన ఒక సినిమా గురించి ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్లే తనను హీరో ఉన్ని ముకుందన్ చేయి చేసుకున్నారని మేనేజర్ విపిన్ వెల్లడించారు. దీంతో ఉన్ని ముకుందన్ నిన్నటి రోజున ఉదయం తన అపార్ట్మెంట్కు వచ్చి మరి తన మీద దాడి చేశారంటూ ఫిర్యాదులో ఉన్నీర్ ముకుందన్ మేనేజర్ ఫిర్యాదుల తెలియజేశారు.


ఉన్ని ముకుందన్ కూడా  తన చిత్రాలని తెలుగులో డబ్బింగ్ చేసి మంచి విజయాలను అందుకున్నారు. శకుంతలం , మార్కో చిత్రం ద్వారా సరికొత్తగా ఆడియన్స్ ని అలరించారు. మార్కో సినిమా తర్వాత కొత్తగా అవకాశాలు రాకపోవడంతో ఉన్ని ముకుందన్ చాలా మానసికంగా ఇబ్బందులు పడ్డారని ఆ సమయంలో తాను మరో హీరో సినిమాను కూడా ప్రశంసించడంతో తన పైన దాడి చేశారంటూ వెల్లడించారు విపిన్. అంతేకాకుండా ఉన్ని ముకుందన్ మీద తానే ఫిలిం అసోసియేషన్ కు కూడా ఫిర్యాదు చేశాను అంటూ మేనేజర్ విపిన్ కుమార్ తెలిపారు. గతంలో కూడా ఉన్ని ముకుందన్ లైంగిక వేధింపులకు కేసు , సీక్రెట్ ఏజెంట్ పైన బెదిరింపులు వంటివి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: