కల్ట్ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం టాప్ ఆఫ్ ది ఇండియన్ సినిమా గా మారిపోయాడు .. త‌న నెక్స్ట్ సినిమా స్పిరిట్ .. ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు .. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరో గా రాబోతున్న ఈ పోలీస్ యాక్షన్ సినిమా లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె ను ముందుగా హీరోయిన్గా ఓకే అయింది .. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఇటివ‌ల‌ ఆమెను సినిమా నుంచి తీసేశారు .. అలాగే ఆమె స్థానంలో మరో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని సినిమా లోకి తీసుకున్నారు .


ఇక దీంతో దీపికా వర్సెస్ సందీప్ రెడ్డి అనే విధంగా వార్‌ మారిపోయింది .. ఇదే క్రమంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి పై స్పిరిట్ మూవీ పై బాలీవుడ్ పిఆర్ గట్టి విషయం చెమడంతో సందీప్ రెడ్డి ఈ విషయం పై గట్టిగా సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు .. డైరెక్టర్గా తాను ఒక యాక్టర్ కి కథ ను చెప్పినప్పుడు అది బయటకు చెప్పరానే నమ్మకం తో ఉంటానని .. కానీ తన సినిమా విషయం లో ఇది ఆ హీరోయిన్ ఉల్లంఘించిందని ఆయన ఘాటు గా మండిపడ్డారు ..
 

అయితే ఇప్పుడు సందీప్ రెడ్డి ముందు మేజర్ టాస్క్ రాబోతుందని చెప్పాలి ..  సో కాల్డ్ బాలీవుడ్ పిఆర్ నోరు మూయించాలంటే .. ముందుగా స్పిరిట్ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాల్సి ఉంటుంది .. అలాగే ఈ సినిమాతో ఆయన భారీ సక్సెస్ అందుకుంటేనే బాలీవుడ్ పిఆర్ సైలెంట్ అవుతుందని కూడా పలువురు కామెంట్లు చేస్తున్నారు .. ఇక మరి ఈ యుద్ధంలో సందీప్ రెడ్డి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో కాలమే సమాధానం చెప్పాలి .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: