
హరిహర వీరమల్లు సినిమాకు అల్లు ఫ్యాన్స్ నుంచి సపోర్ట్ లభిస్తుందా లేదా అనే చర్చ సైతం ప్రస్తుతం జరుగుతుండగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. పవన్ ఫ్యాన్స్ మాత్రం పవర్ స్టార్ హరిహర వీరమల్లు సినిమాతో సంచలన రికార్డులు క్రియేట్ చేయలని భావిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ల సినిమా కూడా లేదనే సంగతి తెలిసిందే.
హరిహర వీరమల్లు సినిమాతో పవన్ సులువుగా 200 కోట్ల రూపాయల కలెక్షన్లను అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. హరిహర వీరమల్లు సినిమా ఇతర భాషల భాషల ప్రేక్షకుల మెప్పు పొందుతుందా అనే చర్చ సైతం జరుగుతుంది. హరిహర వీరమల్లు సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
హరిహర వీరమల్లు సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ ను ఎన్నో రెట్లు పెంచే సినిమా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమా బడ్జెట్ లెక్కలు విని ఇండస్ట్రీ వర్గాలు షాకవుతున్నాయి. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ సైతం పారితోషికం తగ్గించుకున్నారని తెలుస్తోంది. ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు