
కల్కి1 పూర్తి అయ్యిందని కల్కి2 ఎప్పుడు వస్తుందా అనే అనుమానం మొదలైంది.ఈ సినిమా 2025 లోని రిలీజ్ లో ఉంటుందంటూ అప్పట్లో చిత్ర బృందం చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ 75% వరకు పూర్తి అయ్యిందని వార్తలు కూడా వినిపించాయి. ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. సుమారుగా ఈ సినిమా రెండేళ్లుగా షూటింగ్ జరుపుతూనే ఉన్నారు. మరొకపక్క డైరెక్టర్ హను రాఘవపూడి తో ఫౌజీ సినిమాలో కూడా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు ఇటీవలే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ సినిమాను కూడా లైన్ లోకి పెట్టారు ప్రభాస్.
ఈ ఏడాది చివరిలో స్పిరిట్ సినిమాని మొదలు పెట్టాలా సందీప్ రెడ్డివంగా ప్లాన్ చేశారు.. ఇక ఇవే కాకుండా సలార్ 2, కల్కి 2 సినిమాలు చేయవలసి ఉన్నది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా తీస్తున్నారు కనుక ఆ సినిమా అయిపోయిన వెంటనే సలార్ 2 ఉండవచ్చు.. అయితే కల్కి 2 ఎప్పుడు అన్నది ఇప్పుడు అభిమానులు సందేహంగా మిగిలిన ప్రశ్న?. రాజా సాబ్ లాంటి చిన్న చిత్రానికే రెండు సంవత్సరాలు సమయం తీసుకున్నప్పుడు మరి కల్కి 2 చిత్రానికి మరింత భారం ఉంటుందని ఈ సినిమాకి కచ్చితంగా మూడేళ్ల సమయం పడుతుందనే విధంగా అభిమానులు భావిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తూ ఉంటే ఈ సినిమా 2028 ఆ మధ్యలో వచ్చేలా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.