టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన నటించిన సినిమాలు విడుదల కానున్నాయి అంటే ఆ ముందు నుండే పవన్ ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఆనందం నెలకొంటూ ఉంటుంది. ఆయన సినిమా విడుదల అయింది అంటే థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. పవన్ నటించిన సినిమాకు హిట్ , ఫ్లాప్ టాక్ తో సంబంధం లేకుండా అద్భుతమైన కలెక్షన్లు వస్తుంటాయి. ఆయన నటించిన సినిమాకు హిట్ టాక్ వచ్చినట్లయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే పవన్ కొంత కాలం క్రితం సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే మూవీ ని స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయింది. ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ నుండి కొంత కాలం క్రితం ఈ మూవీ బృందం వీడియోను విడుదల చేయగా అది అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయికి చేరిపోయాయి.

ఇకపోతే ఈ మూవీ పై కర్ణాటక ఏరియాలో కూడా భారీ క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ... ఈ సినిమా యొక్క కర్ణాటక హక్కులను ఏకంగా 12.5 కోట్ల భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. కర్ణాటక ఏరియాలో ఈ ధరకు ఈ సినిమా అమ్ముడుపోవడంతో పవన్ క్రేజ్ మామూలుగా లేదుగా అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: