ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది కాలంలో పెద్ద సినిమాల టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. అయితే ఇకపై మాత్రం పరిస్థితులు మారనున్నాయని సమాచారం అందుతోంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిబంధనలను సైతం మార్చేశారనే సంగతి తెలిసిందే. మొన్నటివరకు ఒక విధంగా వ్యవహరించిన పవన్ ఇప్పుడు మరో విధంగా వ్యవహరించే దిశగా అడుగులు వేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
 
ఇకపై టికెట్ రేట్ల పెంపు విషయంలో వ్యక్తిగత భేటీలు ఉండవని తెలుస్తోంది. ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇకపై రాష్ట్రంలో ఈ విధానమే అమలు కానుంది. హరిహర వీరమల్లు నిర్మాత సైతం ఫిల్మ్ ఛాంబర్ ద్వారానే టికెట్ రేట్ల పెంపు దిశగా అడుగులు వేయాల్సి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
 
టికెట్ ధరల పెంపు విషయంలో కూడా పునరాలోచిస్తామని పవన్ చెప్పడంతో నిర్మాతల దరిద్రం మామూలుగా లేదుగా అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ నిర్ణయాలతో పెద్ద సినిమాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఉంది.
 
పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలోనే ఉంది. పవన్ తన సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొనకపోయినా ఆయన సినిమాలు సృష్టుస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు. పవన్ కళ్యాణ్ నిర్ణయాల వల్ల ఇండస్ట్రీకి లాభం కలుగుతుందో నష్టం కలుగుతుందో చూడాల్సి ఉంది. పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సైతం కోట్ల సంఖ్యలో ఉన్నారు. పవన్ సాధిస్తున్న రికార్డులు ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అవుతూ కెరీర్ పరంగా సంచలనాలు సృష్టిస్తున్నారు.




 


మరింత సమాచారం తెలుసుకోండి: