
అయితే ఈ సినిమా రిలీజ్ కాకుండా అడ్డుపడుతోంది ముఖ్యంగా గ్రాఫిక్స్ పనులే.. గ్రాఫిక్స్ కే ఎక్కువ సమయం తీసుకుంటోందట. విశ్వంభర సినిమాకి కూడా విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఇంపార్టెంట్ కావడం చేత చిత్ర బృందంతో పాటు చిరంజీవి కూడా ఈ గ్రాఫిక్స్ పైన ఎక్కువగా పనులు చేపట్టాలని దగ్గరుండి మరి చేయిస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ స్థాయిలో గ్రాఫిక్స్ ని చూపించే పనిలో పడినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ఎలా ఉండేదో ఆ విధంగానే విశ్వంభర సినిమాని తీసేలా ప్లాన్ చేస్తున్నారు.
ముఖ్యంగా మెగాస్టార్ కి కూడా విశ్వంభర చిత్రం మీద భారీ హైప్స్ ఉండడంతో పాటు అభిమానులను కూడా మరింత ఎక్సైటింగ్ అయ్యేలా చేస్తోంది. కానీ రిలీజ్ డేట్ విషయం పైన మాత్రం ఇప్పటివరకు సరైన క్లారిటీ లేదు. విశ్వంభర సినిమాలో కీలకమైన పాత్రలో ఆషిక రంగనాథ్, మీనాక్షి చౌదరి వంటి వారు నటిస్తున్నట్లు సమాచారం. మరి సూపర్ విజువల్ ట్రీట్ తో మరొకసారి అభిమానులను ఆకట్టుకోవాలని పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈసారి విడుదల చేసే టీజర్, ట్రైలర్ తో ఇప్పటివరకు ఉన్న మైనస్సులన్నీ తొలగిపోవాలనే విధంగా ప్లాన్ చేస్తున్నారట. మరి ప్లాన్ ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.