సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో ఒక్కొక్కటిగా చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా సీనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మరి ఇంతకీ సీనియర్ ఎన్టీఆర్ భార్య కంటే ముందు ఎవరిని ప్రేమించారు..ఆమె ఎవరు.. ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేది ఇప్పుడు చూద్దాం. సీనియర్ ఎన్టీఆర్ మేన మరదలు  బసవతారకం.. అయితే బసవతారకం కంటే ముందే సీనియర్ ఎన్టీఆర్ ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డారు. అంతేకాదు ఆమెనే ఆయన ఫస్ట్ క్రష్ అట.మరి ఇంతకీ ఎన్టీ రామారావు మనసు దోచిన ఆ అమ్మాయి ఎవరయ్యా అంటే ..

ఎన్టీఆర్ ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఆయన ఇంట్లో ఓ వ్యాపారి రెంట్ కు ఉండేవారట. ఆయన పేరే సూర్య నారాయణ.. అలా ఇంట్లో అద్దకుండే సూర్య నారాయణ పెద్ద కూతురుని అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ప్రేమించారట.ఈ అమ్మాయే సీనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ క్రష్ అట. ఆమెను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్డారట ఎన్టీఆర్. ఆ తర్వాత బసవతారకాన్ని పెళ్లి చేసుకున్న సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చాక కూడా సీనియర్ నటి కృష్ణకుమారిని పెళ్లి చేసుకోవాలని పెళ్లిదాకా వెళ్లారు.

కానీ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ రావు కృష్ణకుమారి తలకి గన్ పెట్టి బెదిరించడంతో ఆమె పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఊరే విడిచి పారిపోయింది. ఇక ఎన్టీఆర్ కృష్ణ కుమారిని పెళ్లి చేసుకోకుండా నందమూరి ఫ్యామిలీ ఆపగలిగింది కానీ ఆయన్ని రెండో పెళ్లి చేసుకోకుండా ఆపలేకపోయారు. ఎందుకంటే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాక నందమూరి ఫ్యామిలీకి దూరమయ్యారు. నందమూరి ఫ్యామిలీ ఎవరు కూడా లక్ష్మీపార్వతిని యాక్సెప్ట్ చేయలేదు. లక్ష్మీపార్వతి తో పెళ్లి తర్వాత ముఖ్యమంత్రి పదవి కూడా కోల్పోయి సొంత పార్టీలోనే విమర్శలకు గురయ్యారు

మరింత సమాచారం తెలుసుకోండి: