మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రవితేజ కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు. ఆ తర్వాత సినిమాలో చిన్న చిన్న వేషాలు నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే రవితేజ కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్రలో కూడా నటించాడు. ఇకపోతే ఈయన ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకొని ఈయన హీరోగా నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయాలు సాధించడంతో రవితేజ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఈమేజ్ కలిగిన హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.

కానీ ఈ మధ్య కాలంలో మాత్రం రవితేజకు వరస పెట్టి భారీ అపజయాలు దక్కుతున్నాయి. ఇకపోతే రవితేజ ఫ్యాన్స్ ఎప్పుడు తమ అభిమాన నటుడు భారీ విజయాన్ని అందుకుంటాడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రవితేజ "మాస్ జాతర" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఆ తర్వాత ఈ మూవీ విడుదల తేదీ వాయిదా పడింది. ఇక ఈ మూవీ విడుదల అప్పుడు , ఇప్పుడు అని అనేక తేదీలు బయటకు వచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 27 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు అని వార్తలు రావడంతో మరి మూవీ విడుదల ఇంత డిలేనా అని ఆయన అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది. రవితేజ తన నెక్స్ట్ మూవీ ని కిషోర్ తిరుమల తో చేయనున్నట్లు , ఆ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. దానితో రవితేజ అభిమానులు ఖుషి అయ్యారు.

కానీ ఇప్పుడు మాస్ జాతర సినిమా ఆగస్టు 27 వ తేదీన పూర్తి కానున్నట్లు వార్తలు రావడంతో కిషోర్ తిరుమల తో రవితేజ ఎప్పుడు సినిమా స్టార్ట్ చేస్తాడు ..? దానిని ఎప్పుడు పూర్తి చేస్తాడు ..? ఈ సినిమా సంక్రాంతికి రావడం కష్టం అని కొంత మంది అభిప్రాయ పడుతూ ఉండడంతో రవితేజ అభిమానులు ఈ విషయంలో కూడా నిరుత్సాహ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt