సౌత్ స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు బాలకృష్ణ,నాగార్జున,చిరంజీవి,వెంకటేష్ వంటి హీరోలతో ఎన్నో హిట్స్ సినిమాలు చేసిన సిమ్రాన్ ప్రస్తుతం తన ఏజ్ కి తగ్గ పాత్రలు చేస్తూ ఇప్పటికి సినిమాల్లో బిజీగానే ఉంటుంది.ఇక రీసెంట్ గానే మోహన్లాల్ తో కలిసి నటించిన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా హిట్ కొట్టడంతో సిమ్రాన్ కి మళ్లీ వరుస ఆఫర్స్ వస్తున్నాయి.. అయితే ఈ మధ్యకాలంలో సినిమాల్లో బిజీ అయిన సిమ్రాన్ గురించి తాజాగా ఓ రూమర్ వినిపిస్తోంది.అదేంటంటే సిమ్రాన్ కి తన చెల్లెలు మోనాల్ తో విభేదాలు ఉన్నాయని, అందుకే చెల్లెలు చచ్చిపోతే కనీసం చివరి చూపు చూడ్డానికి కూడా వెళ్లలేదు అంటూ ఒక వార్త వినిపిస్తోంది  మరి సొంత చెల్లెలు సూసైడ్ చేసుకొని చనిపోతే సిమ్రాన్ ఎందుకు చివరిసారి చూడటానికి వెళ్లలేదు అనేది ఇప్పుడు చూద్దాం..

 ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపిన సిమ్రాన్ ఇప్పటికి కూడా తన క్రేజ్ పోనిచ్చుకోవడం లేదు.  అయితే రీసెంట్ గా జ్యోతికతో జరిగిన వివాదంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచిన సిమ్రాన్ తాజాగా టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ తో హిట్ కొట్టింది  అయితే సిమ్రాన్ కి చెల్లెలు మోనాల్ ఉన్నారని, ఆమె కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ అనే విషయం చాలా మందికి తెలియదు. ఎందుకంటే సిమ్రాన్ చెల్లెలు మోనాల్ ఇప్పుడు బతికి లేదు. ఆమె చనిపోయి దాదాపు రెండు దశాబ్దాలు అవుతోంది.. దాంతో మోనాల్ ని ఎక్కువగా గుర్తుపట్టరు. అయితే సిమ్రాన్ చెల్లెలు మోనాల్ ఓ కొరియోగ్రాఫర్ ని ప్రేమించి ఆయన చేతిలో మోసపోవడం వల్ల సూసైడ్ చేసుకొని మరణించింది.

అయితే చెల్లెలు సూసైడ్ చేసుకొని మరణిస్తే కనీసం చివరి చూపు చూడ్డానికి కూడా వెళ్లలేదట సిమ్రాన్. ఈ విషయంలో చాలామంది అప్పట్లో ఆమెపై విమర్శలు చేశారు. కనీసం సొంత చెల్లెలు చనిపోతే చివరి చూపు చూడ్డానికి కూడా తీరిక లేదా.. అని సిమ్రాన్ ని విమర్శించారు. అంతేకాదు మోనాల్ తో సిమ్రాన్ కి గొడవలు ఉన్నాయని, ఈ గొడవల కారణంగానే చెల్లెలు చనిపోయినా కూడా కడసారి చూపుకు వెళ్లలేదని చాలామంది మాట్లాడుకున్నారు.కానీ ఇవేవీ నిజం కాదని రీసెంట్గా సిమ్రాన్ తెలియజేసింది. నా చెల్లెలితో నాకు ఎలాంటి గొడవలు లేవు.

కానీ బాగా కావాల్సిన వాళ్ళు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ బాధ అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుసు. నా చెల్లి అంటే నాకు ఎంతో ఇష్టం.. ఎంతో ఇష్టమైన వ్యక్తి అలాంటి పరిస్థితుల్లో ఉంటే చూడడానికి ఎవరు ఇష్టపడరు. అందుకే నా చెల్లెలు చనిపోయిన సమయంలో ఆమెను చూడడానికి నాకు మనసు రాలేదు.ఈ బాధ అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుంది అంటూ సిమ్రాన్ చెప్పింది. ఇక మోనాల్ చనిపోయిన సమయంలో నా చెల్లెలు చావుకు కారణం ఎవరో నాకు తెలుసు అంటూ పరోక్షంగా మాట్లాడిన సంగతి మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: