సీనియర్ నటి మీనా రెండో పెళ్లి వార్తలు ఆమె భర్త చనిపోయిన రెండు మూడు నెలల నుండే వినిపిస్తున్నాయి. ఇక భర్త చనిపోయి పుట్టడు దుఃఖంలో ఉన్నా కూడా మీనా బయటికి వచ్చి నేను ఎవరిని రెండో పెళ్లి చేసుకోవడం లేదని ప్రస్తుతం నా ధ్యాస మొత్తం నా కూతురు మీదే ఉందని ఇలాంటి పుకార్లు పుట్టించి నన్ను ఇంకా బాధ పెట్టకండి అని చాలా ఎమోషనల్ గా చెప్పింది. ఇక భర్త చనిపోయి ఎంతో బాధలో ఉన్న మీనా మీద కనీస గౌరవం మర్యాద లేకుండా ఆమెపై జాలి కూడా చూపించకుండా ఇప్పటికే ఆమె ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఎన్నో వార్తలు రాస్తున్నారు. అయినప్పటికీ మీనా సైలెంట్ గానే ఉంటుంది. ఇక తన తల్లి బాధను చూడలేక మీనా కూతురు నైనిక కూడా ఓ ఈవెంట్లో తన తల్లి గురించి ఎమోషనల్ గా మాట్లాడింది.

 ఇక నైనిక మాట్లాడిన మాటలకు రజినీకాంత్ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. అయినా కూడా కొంతమంది బండరాళ్ల లాంటి మనుషులు కరగడం లేదు. ఇక మీనా భర్త కు చనిపోయిన కొద్ది నెలలకి మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అయి ప్రస్తుతం తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ ఏ సినిమాలో అవకాశాలు వచ్చినా కూడా చేయడానికి రెడీగా ఉంది. అయితే హీరోయిన్ మీనా రెండో పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ.. ఇక డైరెక్టర్ గీత కృష్ణ ఇప్పటికే ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ లో పాల్గొని హీరో హీరోయిన్ల గురించి దర్శక నిర్మాతల గురించి మ్యూజిక్ డైరెక్టర్ల గురించి ఎన్నో వ్యాఖ్యలు చేశారు.ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ గీత కృష్ణ మాట్లాడుతూ.. మీనా భర్త చనిపోయాక ఎంతో బాధలో మునిగిపోయింది.

 ఆమె భర్త చనిపోవడం చాలా బాధాకరం. అయితే చాలా రోజుల నుండి మీనా రెండో పెళ్లి చేసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏమో జరగవచ్చు అందులో తప్పేముంది.. ఇక మీనా ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో రాణించింది.అలాగే పెళ్లయిపోయాక మీనా బరువు చాలా పెరిగిపోయింది..అంటూ మీనా రెండో పెళ్లి గురించి గీతకృష్ణ చెప్పుకొచ్చారు. అయితే ఇండస్ట్రీ తో సంబంధం ఉండే దర్శకుడు మీనా రెండో పెళ్లి చేసుకుంటే చేసుకోవచ్చు అని మాట్లాడడంతో మరోసారి మీనా రెండో పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ధనుష్ తోనే మీనా రెండో పెళ్లి అంటూ మరోసారి రూమర్లు ఊపందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: