
కూటమి నాగవంశీ నిర్మించిన పలు సినిమాలకు టికెట్ రేట్ల పెంపు ద్వారా ఆర్థికంగా లబ్ధి చేకూర్చగా అదే సమయంలో టీడీపీపై ఉన్న అభిమానంతో నాగవంశీ ఈ మొత్తాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. నాగవంశీ పాతిక లక్షలు ఇచ్చిన నేపథ్యంలో ఇండస్ట్రీకి చెందిన ఇతర నిర్మాతలు సైతం ఈ దిశగా అడుగులు వేస్తారా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం.
నాగవంశీ ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి కాగా ఏపీకి చెందిన పార్టీ కోసం ఈ మొత్తాన్ని డొనేట్ చేయడం గమనార్హం. నాగవంశీ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ లను నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో పాన్ ఇండియా సినిమాల నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్న నాగవంశీ బన్నీ త్రివిక్రమ్, ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాలను హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించనుందని సమాచారం అందుతోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బన్నీ సినిమాలతో హారిక హాసిని, సితార బ్యానర్ల రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సితార నిర్మాత నాగవంశీ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగవంశీ పలు సందర్భాల్లో వివాదాల ద్వారా వార్తల్లో నిలవడం హాట్ టాపిక్ అవుతోంది. నిర్మాతగా నాగవంశీ సక్సెస్ రేట్ విషయంలో టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే. డాకు మహారాజ్ సినిమాతో సైతం నాగవంశీ హిట్ అందుకున్నా ఆ సినిమా నాగవంశీ ఆశించిన స్థాయిలో అయితే సక్సెస్ సాధించలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.